Suhasini : తెలుగుమ్మాయి హీరోయిన్ గా ఎదగడం, అది కూడా తెలుగు ఇండస్ట్రీలో ఈ కాలంలో చాలా కష్టం. సినిమాల్లో అవకాశాలు రావడం ఎంత కష్టమో వచ్చినవాటిని నిలబెట్టుకుని కెరీర్ కొనసాగించడం అంతే కష్టం. నార్త్ నుండి హీరోయిన్స్ ను దిగుమతి చేసుకునేందుకు అలవాటు పడిన తెలుగు ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయి హీరోయిన్ అవ్వడం టాప్ రేంజికి వెళ్లడం అసాధ్యం. అయితే కొంతమంది మాత్రం హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో నటించి అవకాశాలు సంపాదించినా సరైన సినిమాలను ఎంపిక చేసుకోలేక కెరీర్ నాశనం చేసుకున్నారు. అలాంటి ఒక హీరోయిన్ సుహాసిని. ఈమెను జూనియర్ సుహాసిని అని కూడా అంటుంటారు. ప్రస్తుతం అయితే మా టీవీ లో వచ్చే ‘రుక్మిణి’ సీరియల్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్.
ఆ తప్పుల వల్లే కెరీర్ పోయింది…
సుహాసిని నెల్లూరు అమ్మాయి. బాల్యం, చదువు నెల్లూరు లో జరిగినా కాలేజీ చదువుకోసం హైదరాబాద్ వచ్చేసింది. ఇక సినిమాల్లో నటించాలనే ఆశతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆమె డైరెక్టర్ జయ డైరెక్షన్ లో మొదటి సారి హీరోయిన్ గా ‘చంటిగాడు’ సినిమాలో బాలాదిత్య సరసన నటించింది. ఆ సినిమా సుహాసినికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా తరువాత తమిళ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలాగే భోజ్ పురి సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో చంటిగాడు తరువాత పెద్దగా మంచి సినిమాలు రాలేదు.
చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవడం వల్ల తెలుగులో ఆశించినంత సక్సెస్ కాలేదు. ఇక తమిళంలో పర్వాలేదనుకునే టైములో బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’ సినిమాలో రుక్మిణి పాత్రలో బాలకృష్ణ కు భార్యగా నటించింది. ఇక ఈ సినిమా తనకు ఏమాత్రం ప్లస్ అవ్వకపోగా మైనస్ అయింది. వస్తున్న కొద్దీ అవకాశాలు పెద్ద హీరోతో నటించేసరికి కుర్ర హీరోల సినిమాల్లో పోయాయి. దీంతో ఇక బుల్లితెర మీద అడుగుపెట్టి ‘అపరంజి’ సీరియల్ లో నటించింది. ఇక పెళ్లయ్యాక కూడా సీరియల్స్ నిర్మిస్తూ అలాగే సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…