Jabardasth : ఈటీవీ లో వచ్చే మల్లెమాల వారి కామెడీ షో జబర్దస్త్ వచ్చి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఈ షో కి రేటింగ్స్ మాత్రం తగ్గడం లేదు. ఇతర ఛానెల్స్ లో అలాంటి షోలు వస్తున్నా జబర్దస్త్ వాళ్ళను లాగేస్తున్నా అయినా పోటీని తట్టుకుని తగ్గేదేలే అంటూ గట్టి పోటీ ఇస్తున్న జబర్దస్త్ లో ఒకప్పుడు జడ్జిలుగా నాగబాబు రోజా ఉండేవారు. మధ్యలో ఎపుడైనా వాళ్లలో ఎవరైనా డుమ్మా కొడితే కొత్తవాళ్లు వచ్చేవారు. ఇపుడు వీరిద్దరూ వేర్వేరు కారణాలతో జబర్దస్త్ విడిచి వెళ్ళడంతో జడ్జిగా ఇన్నిరోజులు మనోగారు ఇంద్రజా వచ్చేవారు. ఇక ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు ఇంద్రజా గారు అప్పుడప్పుడు ఖుష్భు గారు వచ్చి అలరిస్తున్నారు.
పంచ్ లేసే కృష్ణభగవాన్ మీదే పంచులేసిన ఇంద్రజ…
కృష్ణభగవాన్ గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లో వేసే పంచులకు నవ్వుకోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఇక అనారోగ్య కారణాలతో ఇతర కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కృష భగవాన్ గారు మళ్ళీ ఈటీవీ పుణ్యమా అని జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెని ల్లో కనిపిస్తున్నారు. ఇక చాలా మంది జబర్దస్త్ ఫ్యాన్స్ కూడా కృష్ణభగవాన్ గారిని జడ్జి గా కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పడంతోనో ఏమో మళ్ళీ ఆయన జబర్దస్త్ వేదిక మీద కనిపిస్తున్నారు.
ఇక రీసెంట్ ప్రోమోలో పరదేశి సూపర్ మచ్చి పాటకు చేతులుపుతూ డాన్స్ చేస్తే వెంటనే ఇంద్రజ గారు ఎంత సేపు తవ్వుతూ ఉంటావు అంటూ పంచ్ వేస్తారు. వెంటనే కృష్ణ భగవాన్ గారు అయినా బాగుంది అనడంతో వెంటనే ఇంద్రజ గారు ఈయన అంతకంటే వరెస్ట్ గా వేస్తారనుకుంటాను అం దుకే బాగుందని అంటున్నారు అంటూ కృష్ణభగవాన్ ను ఉద్దేశించి అంటారు. అలా పంచులేసే కృష్ణ భగవాన్ గారికే పుంచేలేసింది ఇంద్రజ. ఇక ఇంద్రజ ఆ మధ్య చేసిన ఆటో లో వెళ్తున్న రీల్ కూడా రోస్ట్ చేసేసారు మన జబర్దస్త్ కమెడియన్స్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…