Categories: FeaturedMovie News

Super star Krishna : సూపర్ స్టార్ ఫంక్షన్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్… అదిరిపోయే లెవెల్ లో జరిగిన అగ్నిపర్వతం 100 డేస్ ఫంక్షన్..!

Super star Krishna : దర్శకేంధ్రుడు రాఘవేంద్ర రావు మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్. ఇక ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇక అలాంటి సూపర్ స్టార్ తో దర్శకేంధ్రుడి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు తొమ్మిది అయితే అందులో దాదాపు అన్ని సినిమాలు హిట్లుగా నిలిచాయి. అందులో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన సినిమా అగ్నిపర్వతం. సూపర్ స్టార్ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా అగ్నిపర్వతం 1 కేంద్రాల్లో వందరోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమాగా నిలిచింది.

మెగాస్టార్ చీఫ్ గెస్ట్…

రాఘవేంద్ర రావు, కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిది సినిమాలలో ఏడవ సినిమా అగ్నిపర్వతం. ఈ సినిమా కోసం 28 లక్షల బడ్జెట్ పెట్టారు వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్. ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీదేవి ని అనుకున్నా ఆమె వద్దనుకోవడంతో విజయశాంతి, రాధా లను ఫైనల్ చేసారు. ఇక రాఘవేంద్ర రావు అనగానే పాటల్లో హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

సినిమా షూటింగ్ మాద్రాస్ లో జరిగిన వేడుకకు బాలీవుడ్ హీరో జితేంద్ర హాజరయ్యారు. తొలిసారి పద్మాలయా స్టూడియో ప్రారంభం అయ్యాక అందులో నిర్మించిన మొదటి సినిమా అగ్నిపర్వతం. ఇక సినిమాలో జమదగ్ని పాత్రలో కృష్ణ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక సినిమా షూటింగ్ ఊటి, మద్రాస్, హైదరాబాద్, నెల్లూరు లో జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అయి 100 డేస్ ఫంక్షన్ మద్రాస్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్, బాలీవుడ్ నుండి జితేంద్ర ముఖ్య అతిధులుగా హాజరవడం విశేషం.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago