Gattamaneni Hanumantha Rao : సూపర్ స్టార్ కృష్ణ తెనాలి దగ్గర బుర్రిపాలెం అనే ఊరు నుండి సినిమా మీద మక్కువతో మద్రాస్ కు వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి చివరికి పెద్ద హీరోగా ఎదిగారు. ఇక కృష్ణ గారికి ఇద్దరు సోదరులు హనుమంత రావు, అధిశేష గిరి రావు. పెద్ద తమ్ముడు హనుమంత రావు గారు కృష్ణ గారి ప్రతి అడుగులో ఉండేవారు. ఆయనకు ముక్కుసూటి మనిషి అని పేరు కూడా ఉంది. పద్మాలయ స్టూడియో బాధ్యతలను చూసుకుంటూ పద్మాలయా బ్యానర్ లో నిర్మితమయ్యే సినిమాల కథ, నిర్మాణం విషయంలో ఆయన బాధ్యత తీసుకునేవారు. ఆయన పద్మాలయా చూసుకున్ననన్ని రోజులు పద్మాలయా నుండి హిట్ సినిమాలు వచ్చాయి.
హనుమంతరావు అంటే అందరికీ హడల్…
1944 అక్టోబర్ 1 న బుర్రిపాలెం లో జన్మించిన హనుమంత రావు గారు డిప్లొమా చదివి ప్రభుత్వం ఉద్యోగంలో చేరి నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇక అన్న కృష్ణ గారు సినిమాలలో హీరోగా నిలదొక్కుకోవడంతో హనుమంతరావు గారు ఉద్యోగం వదిలేసి మద్రాస్ వచ్చి అక్కడ అవడి లో ఉన్న మిలిటరీ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఇక సినిమాల్లో నటించాలనే ఇష్టంతో ‘అనురాధ’ అనే సినిమాలో సీఐడి ఆఫీసర్ గా చిన్న వేషం వేశారు. ఆ తరువాత ‘గూఢచారి’ సినిమాలో కూడా నటించారు. పద్మాలయా స్టూడియో ఏర్పాటు చేసాక మొత్తం పద్మాలయా బాధ్యతలను హనుమంతరావు గారు చూసుకునే వారు. అక్కడ నిర్మించే సినిమాలకు కూడా కథ, అన్ని విషయాలూ ఆయన చూసుకునేవారు. ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా చెప్పే హనుమంతరావు గారంటే ఇండస్ట్రీలో చాలా మంది బయపడేవారట. ‘ఖైదీ’ సినిమాని హిందీ లో తీయమని రాఘవేంధ్రరావు ను అడిగితే మీరు రెమ్యూనరేషన్ తక్కువ ఇస్తారు తెలుగులోనే నాకు ఇంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని రాఘవేంద్ర రావు అనడంతో నాకు రాఘవేంద్ర రావు అయినా ఒకటే అతని అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఒకటే అంటూ చెప్పి మిమ్మల్ని హిందీ లో మొదట పరిచయం చేసింది మేము అది మర్చిపోవద్దు అని చెప్పి వచ్చేసారట.
ఆ తరువాత రాఘవేంద్ర రావు అసిస్టెంట్ డైరెక్టర్ కి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. ఇక అల్లూరి సీతరామరాజు సినిమా టైటిల్ వివాదం అప్పుడు కూడా హనుమంత రావు కీలక పాత్ర పోషించారు. టైటిల్ రిజిస్టర్ చేయించాలని అనుకున్నపుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ డివిఎస్ రాజు, సెక్రటరీ గా యూ విశ్వేశ్వరావు లు ఉండగా ఇద్దరూ ఎన్టీఆర్ మనుషులు కావడంతో టైటిల్ ఇవ్వడానికి ఆలోచించారట. అందునా విశ్వేశ్వరావు గారు ఎన్టీఆర్ గారికి బావ అవుతారట, దీంతో కోపం వచ్చిన హనుమంతరావు గారు ఛాంబర్ కి సెక్రటరీవా లేక మీ బావ కా అంటూ అడిగేసరికి మరుసటి రోజుకి టైటిల్ ను రిజిస్ట్ చేశారట. ఇలా కృష్ణ గారి సినిమాల విషయంలో అన్నకు తోడుగా నిలబడిన హనుమంత రావు గారు 1993 లో మరణించారు. ఇక ఆయన పిల్లలు శేషగిరిరావు కలిసి పద్మాలయ బ్యానర్ పనులు చూసుకుంటూ ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…