Tag Archives: allu ramalingaiah

Allu Aravind: తండ్రికి అవకాశాలు ఇవ్వద్దని డైరెక్టర్లను అల్లు అరవింద్ వేడుకున్నారా.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్!

Allu Aravind: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అల్లు రామలింగయ్య హాస్యనటుడుగా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల పాటు వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఈయన వారసుడిగా గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తన కుమారుడు అల్లు అరవింద్ ను ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు. ఇక అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇకపోతే తాజాగా అల్లు అరవింద్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావుతో పాటు సురేష్ బాబు వంటి వారు కూడా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ రాఘవేంద్రరావు గారిని ప్రశ్నిస్తూ అల్లు రామలింగయ్య గారు రామానాయుడు గారి,మా తండ్రి గారితో మీకు ఎంతో మంచి అనుబంధం ఉంది వారి గురించి ఏవైనా కొన్ని విషయాలు చెప్పండి అని ప్రశ్నించారు.

రాఘవేంద్రరావు సమాధానం చెబుతూ అల్లు రామలింగయ్య గారు నిత్యం అల్లు అరవింద్ ను తిడుతూ ఉండేవారని చెప్పారు.ఆయన నటనపై మక్కువతో వయసు పైబడిన నటించేవారు. అయితే ఒకరోజు అల్లు అరవింద్ నా వద్దకు వచ్చి ఇది మా ఫ్యామిలీ మేటర్ దయచేసి మా నాన్నకు మీరు వేషాలు ఇవ్వద్దు అని చెప్పారు.అల్లు అరవింద్ వెళ్లిన కాసేపటికి రామలింగయ్య గారు వచ్చి ఏదైనా వేషం ఉందా అని అడిగితే లేదని చెప్పాను.

Allu Aravind:

ఈ మాట విన్న తర్వాత రామలింగయ్య గారు నా కొడుకు మీ వద్దకు వచ్చారు కదా నాకు తెలుసు వాడే నాకు వేషాలు ఇవ్వద్దని చెప్పి ఉంటాడు అంటూ అల్లు అరవింద్ ను బాగా తిట్టేవారని ఈ సందర్భంగా అప్పటి విషయాలను రాఘవేంద్రరావు ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Allu Aravind: అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో గీతా అంటే ఎవరు… ఈ పేరు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి.ఒకప్పుడు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే నిర్మించే ఈ సమస్థలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించే స్థాయికి ఎదిగాయి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.

అల్లు రామలింగయ్య హాస్యనటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించారు.ఇక ఈ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక అల్లు కుటుంబంలో గీత అనే పేరు గల వ్యక్తులు ఎవరూ లేరు. అయితే ఈ బ్యానర్ కు గీత అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఈ పేరు వెనుక కథ ఏంటి అనే విషయాలను తాజాగా అల్లు అరవింద్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ.. ఈ పేరును తన తండ్రి అల్లు రామలింగయ్య పెట్టారని తెలియజేశారు. భగవద్గీత సారాంశం నచ్చడం వల్లే నాన్న ఈ పేరు పెట్టారని అల్లు అరవింద్ తెలియజేశారు.ప్రయత్నం మాత్రమే మనది ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇది సినిమాలకు కరెక్ట్ గా సరిపోతుంది కేవలం సినిమాలను నిర్మించడం వరకే మన పని ఆ ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది ఈ సారాంశం కరెక్టుగా సరిపోతుందన్న ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

Allu Aravind: ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి..

ఈ క్రమంలోనే అలీ కలుగజేసుకొని పెళ్లయిన తర్వాత నిర్మల ఆర్ట్స్ అని పెట్టొచ్చు కదా అంటూ ప్రశ్నించగా… గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి అందుకే పేరు మార్చాలన్న ఆలోచన కూడా రాలేదని అల్లు అరవింద్ తెలిపారు.మరొక విషయం గురించి చెబుతూ కాలేజీ రోజుల్లో గీత అనే గర్ల్ ఫ్రెండ్ కూడా తనకు ఉండేది అంటూ సరదాగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Allu Studio: నిర్మాణం పూర్తి చేసుకున్న అల్లు స్టూడియో.. ఆ రోజే ఘనంగా ప్రారంభోత్సవం!

Allu Studio: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య నటుడిగా కొనసాగుతూ అనంతరం ఆయన వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇంతటితో ఆగకుండా ఈయన సినిమా ఇండస్ట్రీలో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ కుటుంబం నుంచి అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా అల్లు ఫ్యామిలీ స్టూడియో నిర్మాణాన్ని చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.

హైదరాబాదులో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏకంగా 100 కోట్ల నిర్మాణంతో అల్లు స్టూడియో నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ స్టూడియో నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ స్టూడియో ప్రారంభం కానుందని తెలుస్తుంది. అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ ఒకటో తేదీ కావడంతో అదే రోజున అల్లు స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

Allu Studio: అల్లు రామలింగయ్య జయంతి రోజున ప్రారంభం…

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా హాజరు కానుంది. ఇకపోతే ఈ స్టూడియో నిర్మాణం పూర్తయిన తర్వాత అల్లు అరవింద్ స్థాపించినటువంటి ఆహా ఓటీటీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం. అలాగే సినిమా షూటింగులు కూడా ఈ స్టూడియోలో జరుపుకోనన్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియో నిర్మాణంలో అల్లు అరవింద్ ముగ్గురు కుమారుల భాగస్వామ్యం ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానున్నారు.

Star Hero Brother: ఆ విషయంలో స్టార్ హీరో తమ్ముడు పనికిరాడా… భారీగా ఆడుకుంటున్న ఫ్యాన్స్?

Star Hero Brother: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో అవకాశాలు రావని సొంత టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలని అందరికీ తెలిసిందే.సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాగే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు కుటుంబం గురించి పరిచయం అవసరం లేదు అల్లు రామలింగయ్య వారసులుగా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.ఇక ఈయన పెద్ద కుమారుడు అల్లు బాబీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. అలాగే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక చిన్న కుమారుడు అల్లు శిరీష్ సైతం ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఈయన తన నటనతో పలు సినిమాలలో నటించి మోస్తారు హిట్ ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈయనకు ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ లక్ మాత్రం లేదని చెప్పాలి. ఈయన సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటించినా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. ఒకవైపు తండ్రి ఇండస్ట్రీని శాసిస్తున్న ప్రొడ్యూసర్లలో ఒకరు కాగా,మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అన్నయ్య అల్లు అర్జున్ ఉన్నప్పటికీ ఈ హీరో మాత్రం ఇండస్ట్రీలో కొనసాగలేకపోతున్నారు.

Star Hero Brother: అల్లు అరవింద్ తో గొడవపడ్డ శిరీష్…

ఈ క్రమంలోనే అల్లు శిరీష్ గురించి అల్లు ఫాన్స్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి స్టార్ హీరో అయిన అన్న అల్లు అర్జున్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతున్నారని ఈయన నటనకు పనికిరారు అంటూ అల్లు అభిమానులే పెద్ద ఎత్తున అల్లు శిరీష్ పై ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈ విషయం గురించి గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని అయితే ఇంట్లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఉన్నప్పటికీ తనని ఇండస్ట్రీలో నిలబెట్ట లేకపోయారన్న కోపంతో అల్లు శిరీష్ తన తండ్రిపై అలిగి ముంబై వెళ్ళిపోయారని వార్తలు కూడా వస్తున్నాయి.

Chiranjeevi: అల్లు రామలింగయ్య సహాయంతోనే చిరు ఇండస్ట్రీలో ఎదిగారా…ఈ మాటలలో ఎంతవరకు వాస్తవం ఉంది?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే స్వయంగా తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అవకాశాలు పొంది పలు సినిమాలలో నటిస్తూ వచ్చారు.ఈ విధంగా ఇండస్ట్రీలో చిరంజీవి అద్భుతమైన చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న తరువాత నటుడు అల్లు రామలింగయ్య అతనిలో ఉన్న నటుడిని గుర్తించి తన కూతురునిచ్చి వివాహం చేయాలని భావించారు.

With the help of Allu Ramalingaiah did Chiru grow in the industry is this real

ఈ విధంగా చిరంజీవి అల్లు ఇంటికి అల్లుడు అయ్యారు.అయితే చాలామంది మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటికి అల్లుడు అయిన తర్వాత ఎదిగారని భావిస్తారు అయితే ఇది పూర్తిగా అవాస్తవం. చిరంజీవిలో దాగిఉన్న నటుడిని చూసి అల్లు రామలింగయ్య తన కూతురిని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు కానీ తన కూతురిని ఇచ్చిన తర్వాత ఆయన స్టార్ హీరో కాలేదు. అలా అయితే అల్లు రామలింగయ్య ప్రోత్సాహంతో అల్లు అరవింద్ కూడా ఇండస్ట్రీలో హీరో గా ఎంట్రీ ఇచ్చేవారు.

With the help of Allu Ramalingaiah did Chiru grow in the industry is this real

అల్లు అరవింద్ కేవలం ప్రొడ్యూసర్ గా మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకొన్నారు. ఎవరిలో దాగి ఉన్న ప్రతిభ ఆధారంగా వారికి అవకాశాలు వస్తాయి తప్ప ఇతరులు ప్రోత్సహించడం వల్ల అవకాశాలు రావు. మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో సమాజానికి ఉపయోగపడే సినిమాలను ఎంపిక చేసుకొని తన అద్భుతమైన నటన శైలితో నటించడమే కాకుండా, ఇండస్ట్రీకి డాన్సులను కూడా పరిచయం చేస్తూ స్టార్ హీరోగా గెలుపొందారు.

ఒకానొక సమయంలో మెగాస్టార్ ఒక సంవత్సరంలో 14 సినిమాలు విడుదలయ్యాయి. ఈ 14 సినిమా అవకాశాలను అల్లు రామలింగయ్య ఇప్పించి ఉండరు కదా! అవన్నీ కూడా చిరంజీవి ప్రతిభ వల్లే వచ్చాయి.చిరంజీవి స్టార్ హీరో అయిన తర్వాత అల్లు అరవింద్ మద్దతు ఉండవచ్చు కానీ అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి మెగాస్టార్ అయ్యారు అనడం పూర్తిగా అవాస్తవం.

అది మెగాస్టార్ ప్రతిభ మాత్రమే…

ఒకవేళ అల్లు కుటుంబం మెగాస్టార్ చిరంజీవిని ఈ స్థాయికి తీసుకు వచ్చారు అంటే ప్రస్తుతం అల్లు కుటుంబంలో ఉన్నటువంటి శిరీష్ ను కూడా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టవచ్చు. కానీ అలా కుదరలేదు. ఇండస్ట్రీలో కేవలం ప్రతిభ మాత్రమే ఉండాలని మెగాస్టార్ నిరూపించారు. ఇకపోతే మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తీసుకొని అల్లు కుటుంబం నుంచి మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Allu Ramalingaiah : సినిమాల్లో కామెడీకి కాస్తంత విలనిజాన్ని కలగలిపి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లురామలింగయ్య !

Allu Ramalingaiah : ఆయన హాస్యం మూడు తరాల ప్రేక్షకులను అలరించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టిన అల్లురామలింగయ్యకు చిన్నప్పుడు చదవు పెద్దగా అబ్బలేదు. తోటి మిత్రలతో తిరుగుతూ వారిని నవ్విస్తూ కాలం గడిపేవారు. కొద్ది కాలం తరువాత నాటకాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో ఊర్లోకి నాటకాల వారు వచ్చిన ప్రతి సారీ వారి వెంట తిరుగుతూ వారితే స్నేహం చేస్తూ ఏదో ఒక చిన్న వేషం ఇవ్వమని అడిగేవారట. ఆయన ఆసక్తిని మెచ్చిన వారు చిన్న అవకాశం ఇవ్వడం అలా తనకు వచ్చిరాని నటనతో మెప్పించడంతో తన నట జీవితాన్ని నాటకాలతో ప్రారంభించారు అల్లు రామలింగయ్య. 

అప్పట్లో ఓ వైపు నాటకాల్లో పాల్గొంటూనే గాంధీజి పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా సమయాన్ని వృధా చేయలేదు. తోటి వారిని ఏకం చేసి నాటకాలను ప్రదర్శించేవారు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నాటకాలపైనే ఆసక్తి ఉండేది రామలింగయ్య గారికి అలా ఓ సారి గరికపాటి రాజారావు అల్లు రామలింగయ్య నటనను చూసి సినిమాల్లో తొలిసారిగా అవకాశం ఇచ్చారు. 1952 లో విడుదలైన పుట్టిల్లు చిత్రంలో మొదటి సారిగా నటించారు. ఆ తరువాత వద్దంటే డబ్బు, మూగమనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన హాస్యంతో అలరించారు అల్లు రామలింగయ్య. 

కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీకి కాస్తంత విలనిజాన్ని కలగలిపి పోషించిన పాత్రలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్‌లు , సపోర్ట్ చేసే వారు ఎవరూ లేకపోయినా కేవలం తన నటన, మనోధైర్యంతో ముందుకు సాగుతూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా సుమారు వెయ్యికిపైగా సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలను పోషించారు అల్లు. అప్పట్లో కొన్ని పాటల్లోనూ తన విభిన్నమైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే పాటే అప్పట్లోనే కాదు ఇప్పటికీ ట్రెండీ సాంగ్ గానే హిట్ లిస్ట్ లో ఉంది. 90లలోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాను నవ్వుతూ తోటి వారిని నవ్విస్తూ 50 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ సినీ దిగ్గజానికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు సొంతమయ్యాయి. మాయాబజార్ సినిమాల్లో అల్లు రామలింగయ్య నటించిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ఎంతోగానో అలరిస్తాయి.  

Allu Ramalingaiah : ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య నిర్మాతగానూ గీతా ఆర్ట్స్ బానెర్ పైన అనేక చిత్రాలను నిర్మించారు. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అప్పటి స్టార్ హీరో చిరంజీవి ని తన అల్లుడిని చేసుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ తరువాత చిరు నటించిన అల్లుడా మజాకా, ముఠామేస్త్రీ, ఆ ఒక్కటి అడక్కు, మెకానిక్ అల్లుడు, ఆపద్భాందవుడు, పెద్దరికం, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, రాజా విక్రమార్క, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొగ, ఖైదీ నెం.786, ఆకరి పోరాటం వంటి చాలా వరకు సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల జల్లు కురిపించారు. దేవుళ్లు, మావిచిరుగు సినిమాల్లోనూ చివరి దశకు చేరుకున్నా…తన హాస్యాన్ని అందరికీ పంచిన గొప్ప కళాకారుడు. ఆయన మాటలు మాట్లాడే శౌలీ, కామెడీ పంచ్ లు ఇప్పటికీ ప్రేక్షకుల నవ్వులో నిలిచిపోయాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.