Tag Archives: anchor suma

Anchor Suma: కుమారి ఆంటీల మారిపోయిన సుమక్క.. రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ?

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో యాంకర్ సుమ ఒకరు. ఈమె ప్రస్తుతం సినిమా ఈవెంట్లు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సుమ కేవలం సినిమా ఈవెంట్లు మాత్రమే కాకుండా సుమ అడ్డా అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా సుమ కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి వీడియోలను రీల్స్ చేస్తూ చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కుమారి ఆంటీ సోషల్ మీడియాలో భారీగా ఫేమస్ అయ్యారు.

ఇలా కుమారి ఆంటీ ఫేమస్ కావడంతో ఈమెను అనుసరిస్తూ ఇటీవల డీజే సాంగ్ కూడా క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా సుమ అచ్చం కుమారి ఆంటీ లాగా భోజనాలన్నింటిని వడ్డిస్తూ తన టీంతో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యాంకరింగ్ వదిలేసావా…

ఇక ఇందులో సుమ మీది 1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా నాన్న అంటూ చెప్పినటువంటి డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక మధ్య మధ్యలో శివాజీ కామెడీని కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో మొత్తానికి యాంకరింగ్ మానేసి ఫుడ్ బిజినెస్ పెట్టావా సుమక్క అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈమె రీల్ చేసిన విధానంపై కూడా కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C3FlXhOpENO/?utm_source=ig_embed&ig_rid=2f9974cc-77a9-49cf-ae72-0b9b254a5205

Anchor Suma: యాంకర్ సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. వీడియో వైరల్?

Anchor Suma: తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. తెలుగులో ఎన్నో షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఉన్న ఫిమేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే సుమ అనే విధంగా గొప్ప పేరు సంపాదించుకుంది యాంకర్ సుమ. అయితే మొన్నటి వరకు వరుసగా ఫ్రీ రిలీజ్ వేడుకలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు షోలు అంటూ బిజీగా గడిపిన సుమ ప్రస్తుతం యాంకరింగ్ కు కాస్త దూరంగానే ఉంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ సుమ చేసిన పనికి ఒక హీరో కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఏం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు సోహెల్. ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు త్వరలో బూట్‌కట్ బాలరాను అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. దీంతో సోహెల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్, మూవీ హీరోయిన్ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. ఈ షోలో సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. సోహెల్ సుమ అడ్డా షోలో మాట్లాడుతూ..

మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ..

రీసెంట్ గా సుమ అక్క మేనేజర్ కి కాల్ చేశాను నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని అడిగాను. సరే అక్కతో మాట్లాడి చెప్తా అన్నాడు. తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి అక్కా నేను అమౌంట్ తక్కువ ఇద్దాం అనుకుంటున్నా. నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకు సినిమా కూడా చేసాడు. అదంతా నాకు తెలుసు. లైఫ్ లో ఇంత ఎదిగింది ఎందుకు, మీలాంటి వాళ్లకి సపోర్ట్ చేయడానికే అని నాకు ఫ్రీగా చేస్తాను అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్యూ అక్క నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు సోహెల్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C2pXhP3p4rK/?utm_source=ig_embed&ig_rid=7593249a-c7ac-41c9-a923-f400b381cbaa

Anchor Suma: గాయాల పాలైన యాంకర్ సుమ… రాముడికి కోపం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Anchor Suma:యాంకర్ సుమ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే సందడి చేస్తున్నారు. ఇలా సుమా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడం చేతనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా ఉన్నారు.

ఈ విధంగా ఈ సినిమా ఈవెంట్ సుమ యాంకర్ గా లేకపోవడంతో యాంకర్ ఝాన్సీ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.ఇక సుమ ఈ కార్యక్రమంలో కనిపించకపోవడంతో పలువురు సుమ ఎందుకు రాలేదు అంటూ ఆమెను ప్రశ్నించారు. అయితే ఆమె తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె గాయాలు పాలైనటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు.

Anchor Suma: కాలి వేళ్ళకు గాయాలు….


ఈ వెకేషన్ లో భాగంగా ఎక్కువగా షూ వేసుకోవడంతో తన కాళ్ల వేళ్లకు మొత్తం గాయాలు అయ్యాయని ట్రీట్మెంట్ చేయించుకుని ప్లాస్టర్ వేసుకున్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు పై స్పందించిన ప్రభాస్ అభిమానులు ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ వేడుకకు లేకపోవడంతో రామయ్య ఆగ్రహం చెందాడని అందుకే మీకు ఇలా అయింది అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Anchor Suma: రెండింతల రెమ్యూనరేషన్ పెంచేసిన యాంకర్ సుమ… అయినా వెనక్కి తగ్గని నిర్మాతలు!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. సుమ ఒకానొక సమయంలో యాంకర్ గా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండేవారు.

ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఈవెంట్లతో మాత్రం ఎంతో బిజీగా కడుపుతున్నారు. సుమ చేత యాంకరింగ్ చేయిస్తే తమ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది అన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు కూడా సుమా డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఆమెకు వీలు దొరికినప్పుడు తమ సినిమా ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇలా యాంకర్ గా ఇంత డిమాండ్ ఉన్నటువంటి సుమ ఒక్కో ఎపిసోడ్ కి భారీగానే రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారని తెలుస్తుంది. ఒకానొక సమయంలో ఒక సినిమా ఈవెంట్ కి యాంకరింగ్ చేస్తే దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే సుమ ఇప్పుడు ఏకంగా ఆరు కోట్లకు పెంచేసిందని తెలుస్తుంది.

Anchor Suma: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన సుమ…

ఇలా ఈమె తన రెమ్యూనరేషన్ డబల్ చేయడంతో నిర్మాతలు ఒక్కసారిగా ఆలోచనలో పడినప్పటికీ యాంకర్ సుమకి ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినది మొత్తం ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా ఒక ఈవెంట్ కుయాంకర్ గా వ్యవహరించడం కోసం సుమ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి.

Anchor Suma: భర్తతో కలసి యాంకర్ సుమ ప్రత్యేక పూజలు… వైరల్ అవుతున్న ఫోటోలు..?

Anchor Suma: టాలీవుడ్ లో టాప్ యాంకర్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సుమ. కేరళకు చెందిన సుమ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో యాంకర్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. చక్కగా తెలుగు మాట్లాడుతూ..తన మాటలతో, చిలిపి చేష్టలతో ఎంతోకాలంగా ప్రేక్షకులను నవ్విస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.

ఎంతోమంది యాంకర్లు ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా సుమ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా నిరూపించుకుంది.
ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయినా కూడా ఆ సినిమాలో సుమా నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇలా నటిగా, యాంకర్ గా బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యక్తివ్ గా ఉంటుంది.

సొంతం యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచూ వీడియోలు షేర్ చేయటమే కాకుండా ఇన్ స్టా లో రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలు, ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ ఫాల్లోవర్స్ ని పెంచుకుంటుంది. ఇక తాజాగా సుమ తన భర్తతో కలిసి ఒక ప్రత్యేకమైన పూజలో పాల్గొన్న ఫోటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Anchor Suma: లక్ష్మీ పూజలో రాజీవ్ దంపతులు…

గతంలో రాజీవ్ కనకాల సుమ విడాకుల గురించి వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలపై సుమా స్పందించి వారిద్దరి మధ్య గొడవలు ఉన్నది వాస్తవమేనని కాకపోతే ఇద్దరు విడిపోయేంత గొడవలు కాదని క్లారిటీ ఇచ్చింది.ఇక తాజాగా కుటుంబం సంక్షేమం కోసం సుమ, రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ పూజకి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anchor Suma: పోలీసుల కస్టడీలో యాంకర్ సుమ… వైరల్ అవుతున్న ఫోటో… అసలేం జరిగిందంటే?

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంతో మంది యాంకర్లు వచ్చినప్పటికీ సుమను మాత్రం ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. ఇలా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలను తగ్గించిన సినిమా ఈవెంట్లతో బిజీగా మారిపోయారు.

ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేస్తూ, మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్లు సక్సెస్ మీట్ అంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సుమను తాజాగా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

సుమ చేతులకు సంకెళ్లు వేసి కారులో తనని తీసుకు వెళ్తున్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటో వైరల్ అవడంతో సుమను పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే నిజంగానే సుమను పోలీసులు అరెస్టు చేశారు అంటే మనం పొరపాటు పడినట్లే.సుమ ప్రస్తుతం వరుస సినిమా ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు.

Anchor Suma: నాగచైతన్య కస్టడీలో సుమ…

ఈ క్రమంలోనే నాగచైతన్య కస్టడీ సినిమా ఇంటర్వ్యూ కోసం ఇలా బంధించి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. నాగచైతన్య కస్టడీ సినిమా నుంచి గత రెండు రోజులుగా మొదటి పాట విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో కూడా చిత్ర బృందాన్ని నాగచైతన్య ఇలా అరెస్టు చేసి తీసుకెళ్లారు ఇప్పుడు సుమను కూడా ఇలాగే తీసుకెళ్లడంతో సినిమా ప్రమోషన్లలో భాగంగానే తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.

Anchor Suma: అమ్మా నేను నిన్ను చూడను తల్లి… సుమకు కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్… వీడియో వైరల్!

Anchor Suma: యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్ సుమ గురించి గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే ఎన్టీఆర్ యాంకర్ సుమపై సీరియస్ కావడంతో సుమ బోరున ఏడ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ సుమా మాట్లాడారు. ఈ క్రమంలోనే సుమ మాట్లాడుతూ… అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ 30 కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ సినిమా అప్డేట్ ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్ ని కోరుతున్నాము అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ సుమ వంక సీరియస్ గా చూశారు.ఇలా చూడటమే కాకుండా వాళ్ళు అడగకపోయినా నువ్వే చెప్పేలాగా ఉన్నావు అంటూ సీరియస్ అయ్యారు.

ఇలా ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై సుమకు ఎన్టీఆర్ ఫన్నీ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా ఈయన విశ్వక్ హీరోగా నటించిన సినిమా వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ అందరిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు.

Anchor Suma: ఒక్కసారి చూడు తారక్…


ఇలా ఎన్టీఆర్ గురించి చెప్పగానే ఎన్టీఆర్ వేదిక కింద కూర్చొని తనని చూడను అంటూ సైగలు చేశారు. ఇలా ఎన్టీఆర్ సుమ వంక చూడను అంటూ సైగలు చేస్తూ ఉండగా సుమ మాత్రం వేదికపై నుంచి ఒక్కసారి చూడు తారక్ అంటూ మాట్లాడారు.ఇలా తన వంక చూస్తే మరో ఎలాంటి వార్తలను క్రియేట్ చేస్తారో అన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Anchor Suma: ఎన్టీఆర్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ… ఆయన చెబితేనే అడిగానంటూ?

Anchor Suma: యాంకర్ సుమ ప్రస్తుతం సుమ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. గత రెండు రోజులుగా సుమ గురించి ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి గల కారణం ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ సినిమా వేడుకలో భాగంగా ఎన్టీఆర్ సినిమా గురించి టంగ్ స్లిప్ కావడమే కారణం.ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడంతో అభిమానులు మొత్తం ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. అయితే సుమ కూడా ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇస్తారు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా సుమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లు అడగకపోయినా నువ్వే చెప్పించేసేలా ఉన్నావు అంటూ వేదికపై సీరియస్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సుమ తారక్ మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంలో బాగా హర్ట్ అయినటువంటి సుమ పర్సనల్ గా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది.

Anchor Suma: కావాలని అడగలేదు…


అమిగోస్ కార్యక్రమంలో తాను ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ అడగడానికి ఓ కారణముందని తాను ఉద్దేశపూర్వకంగా అడగలేదని, ఈవెంట్ వాళ్లే అలా స్క్రిప్ట్ రాసి ఇవ్వడంతో నేను అడగాల్సి వచ్చిందని దానివల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అంటూ ఎన్టీఆర్ కి సుమ క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని అక్కడితోనే లైట్ తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సుమ యాంకరింగ్ చేసేటప్పుడు తన లిమిట్స్ లో తాను ఉంటుంది. ఇలా మొదటిసారి టంగ్ స్లిప్ కావడంతో ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

Anchor Suma: హీరోయిన్ తో సంతోష్ శోభన్ చాటింగ్.. అందరి ముందు బయట పెట్టిన సుమ ..!

Anchor Suma: టాలివుడ్ ఇండస్ట్రీలో లేడి యాంకర్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సుమ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ యాంకర్స్ గా గుర్తింపు పొందిన సుమ ఇప్పటికీ నంబర్ వన్ యాంకర్ గానే కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఎంత మంది కొత్త యాంకర్లు వచ్చినా కూడా సుమకి పోటీగా నిలవలేకపోతున్నారు. అందుకు కారణం సున యాంకరింగ్ చేసే విధానం.

తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అందరిని నవ్వించే సుమ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా టెలివిజన్ లో ప్రసారం అవుతున్న టీవీ షోలో మాత్రమే కాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ లో కూడా సుమ సందడి చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తోంది.

ఇక సుమ యాంకర్ గా సరికొత్త టీవీ షో తొందరలోనే ప్రారంభం కాబోతోంది. ‘ సుమ అడ్డా ‘ అనే పేరుతో ప్రారంభం కానున్న ఈ షో జనవరి 7వ తేదీ నుండి ప్రసారం కానుంది. ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో కళ్యాణం కమనీయం సినిమా బృందం హాజరయ్యారు. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ప్రియా భవాని శంకర్ లతో పాటు దర్శకుడు కూడా ఈ షో కి హాజరయ్యాడు. ఇక వీరితో సుమ చేసిన సందడి మామూలుగా లేదు.

Anchor Suma: సన్నీ లియోన్ కి మెసేజ్ చేసిన సంతోష్ శోభన్….

ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి సుమ తన ప్రశ్నలతో పలు టాస్కులతో చాలా సందడి చేసింది. ఇక చివరలో హీరో సంతోష్ శోభన్ మొబైల్ తీసుకొని అతని వాట్సాప్ చాట్ లీక్ చేసింది. సంతోష్ వాట్సాప్ లో అనుపమతో చేసిన చాటింగ్ ని అందరిముందూ బయట పెట్టింది. అంతే కాకుండా సంతోష్ సన్నీ లియోన్ కి మెసేజులు పెట్టి వాటిని ఎవరూ చూడకుండా డిలీట్ చేసిన విషయం కూడా అందరి ముందు లీక్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Anchor Suma: అంతా ఉత్తుత్తేనే… యాంకరింగ్ విషయంలో సుమ క్లారిటీ… ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Anchor Suma: ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం హైలెట్ చేయడం కోసం ప్రోమోలు ఎంతో విభిన్నమైన రీతిలో కట్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలా ప్రోమోలు కట్ చేయడం వల్ల నిజంగానే ఏదో జరిగిపోతుందని అభిమానులు తెగ కంగారు పడుతుంటారు. అయితే చివరికి అదంతా అబద్ధమని తెలియడంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉండడం మనం చూస్తున్నాము.

ఇలా ఎపిసోడ్ హైలైట్ కోసం ప్రోమోలలో జిమ్మిక్కులు చేయడం అవి అబద్ధమని తెలియడంతో సదరు యాంకర్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. ప్రస్తుతం యాంకర్ సుమ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈమె కూడా న్యూ ఇయర్ సందర్భంగా వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమంలో తాను మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు తనని ఎంతో ఆదరించారని తాను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు కారణం తెలుగు ఆడియన్స్ అని చెప్పారు.

ఇలా తనని ఎంతో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఈమె కొంత కాలం పాటు తన యాంకరింగ్ కు విరామం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పారు.దీంతో ఇది కాస్త వైరల్ కావడంతో ఎంతోమంది నిజంగానే సుమ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు పెద్ద ఎత్తున కథనాలు వెలబడ్డాయి దీంతో సుమ మరోసారి ఈ వీడియో పై స్పందించి అసలు విషయం చెప్పారు.

Anchor Suma: చెత్త ప్రోమోలతో నీ క్రేజ్ తగ్గించుకోకు…

సోషల్ మీడియా వేదికగా ఈ ప్రోమో పై స్పందించిన సుమ ప్రోమో అంతా ఉత్తుత్తే అని చెప్పేసి.. వీడియో డిలేట్ చేసింది. అయితే.. అప్పటికే కొందరు ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాంకరింగ్ మానేస్తున్నానని చెప్పడం ఎందుకు అంత ఉత్తుత్తే అని చెప్పడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున సుమను ట్రోల్ చేస్తున్నారు.జనాలలో సుమ కార్యక్రమాలు అంటే ఒక క్రేజ్ ఉంది ఇలాంటి చెత్త ప్రోమోలతో ఆ క్రేజ్ కాస్త పోగొట్టుకోకు అంటూ మండిపడుతున్నారు.