Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంతో మంది యాంకర్లు వచ్చినప్పటికీ సుమను మాత్రం ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. ఇలా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలను తగ్గించిన సినిమా ఈవెంట్లతో బిజీగా మారిపోయారు.
ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేస్తూ, మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్లు సక్సెస్ మీట్ అంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సుమను తాజాగా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
సుమ చేతులకు సంకెళ్లు వేసి కారులో తనని తీసుకు వెళ్తున్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటో వైరల్ అవడంతో సుమను పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే నిజంగానే సుమను పోలీసులు అరెస్టు చేశారు అంటే మనం పొరపాటు పడినట్లే.సుమ ప్రస్తుతం వరుస సినిమా ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య కస్టడీ సినిమా ఇంటర్వ్యూ కోసం ఇలా బంధించి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. నాగచైతన్య కస్టడీ సినిమా నుంచి గత రెండు రోజులుగా మొదటి పాట విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో కూడా చిత్ర బృందాన్ని నాగచైతన్య ఇలా అరెస్టు చేసి తీసుకెళ్లారు ఇప్పుడు సుమను కూడా ఇలాగే తీసుకెళ్లడంతో సినిమా ప్రమోషన్లలో భాగంగానే తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…