Anchor Suma: యాంకర్ సుమ ప్రస్తుతం సుమ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. గత రెండు రోజులుగా సుమ గురించి ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి గల కారణం ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ సినిమా వేడుకలో భాగంగా ఎన్టీఆర్ సినిమా గురించి టంగ్ స్లిప్ కావడమే కారణం.ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడంతో అభిమానులు మొత్తం ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. అయితే సుమ కూడా ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇస్తారు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా సుమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లు అడగకపోయినా నువ్వే చెప్పించేసేలా ఉన్నావు అంటూ వేదికపై సీరియస్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సుమ తారక్ మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంలో బాగా హర్ట్ అయినటువంటి సుమ పర్సనల్ గా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది.
అమిగోస్ కార్యక్రమంలో తాను ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ అడగడానికి ఓ కారణముందని తాను ఉద్దేశపూర్వకంగా అడగలేదని, ఈవెంట్ వాళ్లే అలా స్క్రిప్ట్ రాసి ఇవ్వడంతో నేను అడగాల్సి వచ్చిందని దానివల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అంటూ ఎన్టీఆర్ కి సుమ క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని అక్కడితోనే లైట్ తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సుమ యాంకరింగ్ చేసేటప్పుడు తన లిమిట్స్ లో తాను ఉంటుంది. ఇలా మొదటిసారి టంగ్ స్లిప్ కావడంతో ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…