Rashmika: నటి రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కనడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ వారి సమస్యను బయటకు చూపుతూ ఉన్నారు. అయితే సమంత, కల్పిక గణేషన్, మమతా మోహన్ దాస్ వంటి సెలబ్రిటీలు కూడా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నామంటూ తెలియజేశారు. అయితే తాజాగా రష్మిక మదన్న కూడా ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మిక తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా తనకు తన డైరీ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈమె సోమవారం తన రోజువారి దినచర్య ఎలా ఉంది అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరీ రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
డియర్ డైరీ.. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది. లేవగానే కార్డియో వర్క్ అవుట్ చేశా. ఆ తర్వాత ఆహారం తీసుకున్నా. రేపటి షెడ్యూల్ కోసం లగేజ్ సర్దుకున్నా ఇక సర్దడం అయిపోయాక మళ్లీ వర్క్ అవుట్ చేశా. ఆ తర్వాత డిన్నర్ చేశా. ఇక డెర్మట్..(డెర్మటాలజీ) అపాయింట్మెంట్ తీసుకున్న అలాగే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అది క్యాన్సిల్ అయింది. మీటింగ్ క్యాన్సిల్ కావడంతో తిరిగి ఇంటికి వచ్చి పడుకున్న గుడ్ నైట్ అంటూ హార్ట్ సింబల్ షేర్ చేశారు. అయితే ఈమె డెర్మటాలజిస్ట్ తో అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పడంతో రష్మిక కూడా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా అందుకే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…