Featured

Byreddy Rajashekhar Reddy : వాళ్ళలా విశాఖపట్నంను ప్రత్యేక రాష్ట్రం చేయమనడం లేదు… మాకు రాజధాని కావాలి…: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Byreddy Rajashekhar Reddy : రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా గుర్తింపు ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాయలసీమ హక్కులను కాపాడండి అంటూ ఉపన్యాసలు ఇస్తున్నారు. రాయలసీమకు చెందిన సీఎం రాయలసీమ అభివృద్ధిని గాలికి వదిలేసాడంటూ విమర్శించారు. రాజధాని అమరావతిలో లేకపోతే కర్నూల్ లో ఉండాలి కానీ వైజాగ్ కి ఎలా తరలిస్తారు అంటూ ఫైర్ అయ్యారు.

వాళ్ళలా ప్రత్యేక రాష్ట్రం అడగలేదు… మా హక్కు అడుగుతున్నాం…

రాష్ట్ర విభజన తరువాత రాజదని అంశంలో పెద్ధ చర్చ జరిగింది. ఇక అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉందని భావించి అక్కడే పెట్టారు. ఇక ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టి ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలితున్నట్లు చెప్పడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని కానట్లయితే రాజధాని రాయలసీమలో ఉండాలంటూ అది మా హక్కంటూ చెప్పారు.

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. న్యాయ రాజధాని కర్నూల్ కి ఇస్తామని చెప్పి ఇప్పుడు మంగళగిరిలో జ్యూడిషల్ అకాడమీని ఏర్పాటు చేయడంతోనే కర్నూల్ కి మొండి చేయి చూపారని అర్థమవుతుంది అంటూ చెప్పిన ఆయన ధర్మాన ప్రసాద్ వంటి వారు వైజాగ్ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ అనడం గురించి మాట్లాడుతూ అంత ఆశలు మాకేమీ లేవు, మేము అడుగుతున్నది రాజధాని మాత్రమే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago