Prabhas -Kriti sanon: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తన సినిమా షూటింగులతో బిజీగా ఉండగా మరోవైపు ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ప్రభాస్ వచ్చేవారం మాల్దీవ్స్ లో నిశ్చితార్థం జరుపుకోబోతున్నారనే వార్తలు షికార్లు చేశాయి.
ఇలా నటి కృతి సనన్ తోకలిసి ప్రభాస్ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో ప్రభాస్ అభిమానులు ఓకింత గందర గోళానికి గురయ్యారు.ఒకవైపు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని సంతోషం ఉన్నప్పటికీ మరోవైపు అసలు ఈ వార్తలలో నిజం ఉందా అంటూ ఆందోళన చెందారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి నిశ్చితార్థం గురించి వస్తున్నటువంటి వార్తలపై ప్రభాస్ పీ ఆర్ టీమ్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ నటి కృతి సనన్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించిన ప్రభాస్ టీం ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని కొట్టిపారేశారు.ప్రభాస్ నటి కృతి ఇద్దరు కూడా మంచి స్నేహితులని వారిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ వార్తలపై కృతి సనన్ పి ఆర్ టీం కూడా ఖండిస్తూ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.ఇలా వీరి పెళ్లి వార్తలపై ఇరువురి స్టాప్ స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఇది కేవలం ఆ వాస్తవం మాత్రమేనని వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం లేదంటూ అభిమానులకు క్లారిటీ వచ్చేసింది అయితే ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూసే అభిమానులకు ఆయన పెళ్లి గురించి ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పి అనంతరం అది నిజం కాదని చెప్పడంతో కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…