Tag Archives: bahubali

Bahubali: ఇంకా తగ్గని బాహుబలి క్రేజ్… స్విస్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి అంటూ కేకలు!

Bahubali:దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాహుబలి ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. జక్కన్న. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ అనంతరం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇక ఈ కార్యక్రమానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కస్యప్ హాజరయ్యారు. ఇక ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఆడియన్స్ లో కొంతమంది ‘బాహుబలి’ అని అరుస్తున్నారు. మొదటిగా ఒక సినిమా ప్రదర్శించే ముందు యాడ్ ప్లే చేశారు. ఆ సమయంలోను పెద్ద ఎత్తున బాహుబలి అంటూ అరుపులువినిపించాయి ఇలా ఒకసారి కాదు ఏకంగా నాలుగు సార్లు అరుపులు వినిపించాయి.

ఇక ఈ సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ఇండియన్ ఆడియన్స్ మాత్రం కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా బాహుబలిని ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం స్విజర్లాండ్ న్యూచాటెల్‌లో ‘న్యూచాటెల్‌ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ (NIFFF) జరుగుతుంది.

Bahubali: నిజమైన రాక్ స్టార్ మీరు…


ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ దర్శకుడు రాజమౌళికి ట్యాగ్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈయన రాజమౌళి అండ్ ఆయన సినిమా పై ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆయన గనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ ఎంతో ఆనంద పడతారు. రాజమౌళి మీరు నిజమైన రాక్ స్టార్ అంటూ కామెంట్ చేశారు.దీంతో రాజమౌళి రియాక్టర్ థాంక్స్ చెప్పగా ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kalyan Ram: సినిమాని బాహుబలితో పోల్చవద్దు..కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

Kalyan Ram: నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇలా నందమూరి వంశం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వారిలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. చాలాకాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ , టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకులముందుకి రానుంది. ఈ క్రమంలో బింబిసార సినిమా ప్రమోషన్ పనులు మొదలుపెట్టారు.

ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులలో సినిమా మీద అంచనలను పెంచాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణం ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ‘బింబిసార సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినట్టు అనిపిస్తుంది. బింబిసారా సినిమా గ్రాండియర్ లుక్, విఎఫ్ఎక్స్ పరంగా చూస్తే ఇది పెద్ద సినిమాగా అనిపిస్తుంది. బింబిసారను బాహుబలి లైన్ లో చేర్చి.. మరో బాహుబలి తర్వాత అంతటి బిగ్ మూవీ అనుకోవచ్చా?’ అని యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించారు.

బాహుబలి వందల కోట్ల బడ్జెట్ సినిమా..

ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ “దయచేసి బింబిసార సినిమాని బాహుబలితో పోల్చకండి. ఆ సినిమా వందల కోట్లభారీ వరకు వెళ్ళింది. కానీ ఈ సినిమాని మేము మాకున్న బడ్జెట్, పరిధిలో రిచ్ గా రూపొందించాం.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించాడు. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.

RRR Movie: బాహుబలి రికార్డులు పదిలం… ఆర్ఆర్ఆర్ కి అంత సత్తా లేదు… ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మొదలైన వార్!

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. మొదటిరోజే బెనిఫిట్ షో ప్రీమియర్ షోతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా ఈసినిమాపై ఎంతో మంది అభిమానులు, సినీ ప్రేమికులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ సినిమా మొదటి రోజు పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ చరణ్ ప్రభాస్ అభిమానుల మధ్య వార్ మొదలైంది.

RRR Movie: బాహుబలి రికార్డులు పదిలం… ఆర్ఆర్ఆర్ సినిమాకి అంత సత్తా లేదు…అభిమానుల మధ్య మొదలైన వార్!

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పై స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా బాహుబలి సినిమాని ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కలెక్షన్లను, రికార్డులను ఆర్ఆర్ఆర్ సినిమా బ్రేక్ చేయలేదంటూ వెల్లడించారు. బాహుబలి సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ గురించి రాజమౌళి ఎంతో అద్భుతంగా చూపించారు.

RRR Movie: బాహుబలి రికార్డులు పదిలం… ఆర్ఆర్ఆర్ సినిమాకి అంత సత్తా లేదు…అభిమానుల మధ్య మొదలైన వార్!

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలాంటి ఎమోషన్స్ ఏమీ లేవని,ఒక బాలికను తీసుకెళ్ళడం చాలా చిన్న పాయింట్ అని ప్రభాస్ అభిమానులు, పలువురు సినీ క్రిటిక్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో కంపేర్‌ చేస్తూబాహుబలి 2`ని టచ్‌ చేయడం కష్టమని, బాహుబలి సినిమా రికార్డులు పదిలంగా ఉంటాయని ప్రభాస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి రికార్డులను బ్రేక్ చేయగలదా….

బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కాలేదు అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా అత్యధిక థియేటర్లలో, భారీ టికెట్ల ధరలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేయలేదంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న లోపాలను గురించి తెలియజేస్తున్నారు. కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాని ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు మాత్రమే ప్రశంసించగా సాధారణ అభిమానులు మాత్రం ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ సినిమా రికార్డులను బ్రేక్ చేయగలదా లేదా అనే విషయం తెలియాలంటే మరో రెండు మూడు రోజుల వరకు వేచి చూడాలి.

అనంత శ్రీరామ్ ఏ సినిమాలోని పాట రాయడానికి దాదాపు70 రోజుల సమయాన్ని తీసుకున్నాడు.?

కోటి కాంతులతో విరాజిల్లేది ఆ కోదండరాముడు అయితే లక్షల విలువచేసే అక్షరాలను లిఖించేది ఈ అనంత శ్రీరాముడు. సందర్భోచితంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వారి మాటలనే తన పాటలుగా చేసి సందర్భాన్ని, సంగతిని ప్రేక్షకుడి కళ్ళకు కట్టినట్టుగా వినసొంపుగా తన పాటలహరిలో పరవశింప చేస్తాడు.

 

ప్రేమ పాటలను అనంత శ్రీరామ్ అలవోకగా ప్రేక్షకుడి మనసుకు తాకేలా తన కలాన్ని కదుపుతాడు. ప్రేమికుల్లో ప్రేమికుడు అవుతాడు.వారి సరససల్లాపాలను సరిగమలతో చుట్టేస్తాడు. వారి విరహాన్ని విసుక్కుంటాడు. వారి విహారానికి పక్షి లాంటి రెక్కలు తొడుగుతాడు. ప్రేమికుల యెదలో చేరి అన్నీచేస్తూ ఉంటాడు. ఆ వయసులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం అని పలుకుతాడు. ప్రేమికుల మనసులో ఊహా ప్రపంచాన్ని నిర్మిస్తాడు. వారిని ఆనందడోలికల్లో ఊగిస్తాడు.

ఇలాంటి అందమైన అనుభూతి గల పాటలను రాసే అనంత శ్రీరామ్ కి ఒక సందర్భంలో బాహుబలి లోని ఒక పాట రాయడానికి ఆ సినిమా దర్శకుడు రాజమౌళి శ్రీరామ్ ని సంప్రదించాడు. అప్పుడు బాహుబలి లో తమన్నా మాహిష్మతి సామ్రాజ్య తిరుగుబాటు యోధురాలు అదేవిధంగా కథానాయకుడు ప్రభాస్ ఓ గిరిజన తెగలో పెరుగుతున్న యోధుడు. వీరి మధ్య ఏ భాష సరళిని వాడాలి గ్రామ్యమా గ్రాంథికమమా.? అన్నది ఒక అంశం.

ప్రభాస్ తమన్నా లు అన్యోన్యంగా ఉండేటప్పుడు ప్రభాస్ తమన్నాకు వేసిన పచ్చబొట్టు వారి కౌగిలింతలో కలిసేచోటా బావగర్భిత పాట రాయాలని రాజమౌళి చెప్పగా.. అనంత శ్రీరామ్ కి మరింత సమయం కావాల్సి వచ్చింది. అలా పచ్చబొట్టేసిన.. పిల్లగాడా అనే పాట రాయడానికి అనంత శ్రీరామ్ దాదాపు 70 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. బాహుబలి సినిమాలో అలాంటి పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.