RRR Movie: బాహుబలి రికార్డులు పదిలం… ఆర్ఆర్ఆర్ సినిమాకి అంత సత్తా లేదు…అభిమానుల మధ్య మొదలైన వార్!
RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. మొదటిరోజే బెనిఫిట్ షో ప్రీమియర్ షోతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా ఈసినిమాపై ఎంతో మంది అభిమానులు, సినీ ప్రేమికులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ సినిమా మొదటి రోజు పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ చరణ్ ప్రభాస్ అభిమానుల మధ్య వార్ మొదలైంది.
ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పై స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా బాహుబలి సినిమాని ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కలెక్షన్లను, రికార్డులను ఆర్ఆర్ఆర్ సినిమా బ్రేక్ చేయలేదంటూ వెల్లడించారు. బాహుబలి సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ గురించి రాజమౌళి ఎంతో అద్భుతంగా చూపించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలాంటి ఎమోషన్స్ ఏమీ లేవని,ఒక బాలికను తీసుకెళ్ళడం చాలా చిన్న పాయింట్ అని ప్రభాస్ అభిమానులు, పలువురు సినీ క్రిటిక్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో కంపేర్ చేస్తూబాహుబలి 2`ని టచ్ చేయడం కష్టమని, బాహుబలి సినిమా రికార్డులు పదిలంగా ఉంటాయని ప్రభాస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కాలేదు అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా అత్యధిక థియేటర్లలో, భారీ టికెట్ల ధరలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేయలేదంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న లోపాలను గురించి తెలియజేస్తున్నారు. కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాని ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు మాత్రమే ప్రశంసించగా సాధారణ అభిమానులు మాత్రం ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ సినిమా రికార్డులను బ్రేక్ చేయగలదా లేదా అనే విషయం తెలియాలంటే మరో రెండు మూడు రోజుల వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…