Sukumar: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అని వర్గాల నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఫాన్స్ హంగామా అంత ఇంతా కాదు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఫాన్స్ ఆనందానికి అవదుల్లేవు. ఎన్టిఆర్, చరణ్ లకు భారీ కటౌట్ లు, వాటికి పాలాభిషేకాలతో ఫాన్స్ హడావిడి చేస్తున్నారు. అటు సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి.
ఈ నేపధ్యంలో సెలబ్రిటీలు సైతం సినిమా చూసి రివ్యూలు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సహా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తూ సినిమా మేకింగ్ అద్భుతమంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఏకంగా రాజమౌళీని పొగుడుతూ ఒక కవితే రాసేసారు.
తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. రాజమౌళిని పొగుడుతూ చిన్న కవిత రాశారు. ”మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా.. మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే” అంటూ సుకుమార్ తన చిరు కవితతో డైరెక్టర్ రాజమౌళీ ప్రతిభను కొనియాడారు. ఇక ప్రస్తుతం సుకుమార్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…