Featured

RRR Movie : ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి..(వీడియో) !

గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు నేటితో రానే వచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో సందడి చేశారు. ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర హీరోలు. మెగా ఫ్యామిలీ హీరో.. నంద‌మూరి ఫ్యామిలీ హీరో. ఈ రెండు కుటుంబాల‌కు చెందిన హీరోల‌ను ఒకే సినిమాలో న‌టింప చేయ‌డ‌మంటేనే సాహసమే..

అయితే ఈ విషయంలో దర్శకుడు రాజమౌళీ విజయం సాధించారనే చెప్పవచ్చు.. ఇద్దరు హీరోల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టడం కోసం అయన ఎంత కష్టపడ్డారో.. మరోవైపు ఇద్దరు హీరోలు ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఈ నేపద్యంలో ఒక సీన్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం తెలిపే వీడియో ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నేట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ బాక్సింగ్‌ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో రామ్‌ చరణ్‌ ఎంతో కసిగా బాక్సింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాలో ముఖ్యమైన సన్నివేశం అయిన ఈ సీన్ కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో తెలిపే వీడియో అది. అందులో రామ్ చరణ్ కు బాక్సింగ్ నేర్పించిన వ్యక్తీ ఈ వీడియోను ట్వీట్ చేసాడు. డీనితో ఈ వీడియో వైరల్ గా మారింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

5 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

5 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

5 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

5 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

5 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

5 hours ago