గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు నేటితో రానే వచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో సందడి చేశారు. ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోలు. మెగా ఫ్యామిలీ హీరో.. నందమూరి ఫ్యామిలీ హీరో. ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోలను ఒకే సినిమాలో నటింప చేయడమంటేనే సాహసమే..

అయితే ఈ విషయంలో దర్శకుడు రాజమౌళీ విజయం సాధించారనే చెప్పవచ్చు.. ఇద్దరు హీరోల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టడం కోసం అయన ఎంత కష్టపడ్డారో.. మరోవైపు ఇద్దరు హీరోలు ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఈ నేపద్యంలో ఒక సీన్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం తెలిపే వీడియో ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నేట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ బాక్సింగ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో రామ్ చరణ్ ఎంతో కసిగా బాక్సింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాలో ముఖ్యమైన సన్నివేశం అయిన ఈ సీన్ కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో తెలిపే వీడియో అది. అందులో రామ్ చరణ్ కు బాక్సింగ్ నేర్పించిన వ్యక్తీ ఈ వీడియోను ట్వీట్ చేసాడు. డీనితో ఈ వీడియో వైరల్ గా మారింది.
































