Kalyan Ram: నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇలా నందమూరి వంశం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వారిలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. చాలాకాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ , టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకులముందుకి రానుంది. ఈ క్రమంలో బింబిసార సినిమా ప్రమోషన్ పనులు మొదలుపెట్టారు.
ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులలో సినిమా మీద అంచనలను పెంచాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణం ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ‘బింబిసార సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినట్టు అనిపిస్తుంది. బింబిసారా సినిమా గ్రాండియర్ లుక్, విఎఫ్ఎక్స్ పరంగా చూస్తే ఇది పెద్ద సినిమాగా అనిపిస్తుంది. బింబిసారను బాహుబలి లైన్ లో చేర్చి.. మరో బాహుబలి తర్వాత అంతటి బిగ్ మూవీ అనుకోవచ్చా?’ అని యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ “దయచేసి బింబిసార సినిమాని బాహుబలితో పోల్చకండి. ఆ సినిమా వందల కోట్లభారీ వరకు వెళ్ళింది. కానీ ఈ సినిమాని మేము మాకున్న బడ్జెట్, పరిధిలో రిచ్ గా రూపొందించాం.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించాడు. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…