Categories: FeaturedMovie News

Rachana : చిరంజీవితో హీరోయిన్ గా చేసిన రచన కెరీర్ పై ఎందుకు దెబ్బ పడిందో తెలుసా…?

Rachana : బెంగాళికి చెందిన రచన, తన సినీ కెరీర్ ని కూడా మొదట బెంగాలి నుండే ప్రారంభించింది. 1990 లో మిస్ కలకత్త గా కూడా గెలుపొందారు. అంతేకాకుండా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పోటీచేసిన రచన మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ని గెలుపొందారు. బెంగాలిలో రచన 50 కి పైగా సినిమాలలో నటించింది అయితే అందులో దాదాపు 40 కి పైగా సినిమాలు సిద్ధాంత్ మహాపాత్ర తో కలసి నటించినవే అవ్వడం విశేషం. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్ తో కూడా కలసి నటించింది. తెలుగులో ఇ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘నేను ప్రేమిస్తున్నాను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తెలుగు తో పాటు కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించింది రచన. అయితే తెలుగులో మాత్రం అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది.

చిరంజీవితో కలసి నటించినా కలసిరాని కెరీర్…

ఒడియా, హిందీ వంటి బాషలలో మంచి పేరు సంపాదించుకున్నా కూడా తెలుగులో మాత్రం స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వంటి అగ్ర కాథానాయకుల తోనే కాకుండా మోహన్ బాబు, జగపతిబాబు లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది రచన. కానీ అవేవీ రచనని స్టార్ హీరోయిన్‌ని చేయలేకపోయాయి. చిరంజీవి తో హీరోయిన్ గా చేస్తే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అప్పట్లో అనుకునేవారు. చిరంజీవి సరసన చేసినా కూడా రచన కి అదృష్టం కలసి రాలేదు.

కాస్త గ్లామర్ గా కనిపించే పాత్రలు చేస్తే కలిసివస్తుంది అనుకుంటే అలా కూడా రచనకు కలసి రాలేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా అందులో రచన చేసిన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం కారణంగానే కెరీర్ అంతగా కలసిరాలేదు అంటారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలో చేసినా అది సెకండ్ హీరోయిన్ పాత్ర అవ్వడం, అందులోను ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం తో మెగాస్టార్ తో చేసినా కలసిరాలేదు. అందులోను మెగాస్టార్ సినిమా అంటే హీరోయిన్ కాస్త గ్లామర్ గా, ఉంటుందని ఊహించడం వంటి కారణాలు రచన కెరీర్ మీద దెబ్బ పడిందని అనుకోవచ్చు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago