Rachana : బెంగాళికి చెందిన రచన, తన సినీ కెరీర్ ని కూడా మొదట బెంగాలి నుండే ప్రారంభించింది. 1990 లో మిస్ కలకత్త గా కూడా గెలుపొందారు. అంతేకాకుండా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పోటీచేసిన రచన మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ని గెలుపొందారు. బెంగాలిలో రచన 50 కి పైగా సినిమాలలో నటించింది అయితే అందులో దాదాపు 40 కి పైగా సినిమాలు సిద్ధాంత్ మహాపాత్ర తో కలసి నటించినవే అవ్వడం విశేషం. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్ తో కూడా కలసి నటించింది. తెలుగులో ఇ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘నేను ప్రేమిస్తున్నాను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తెలుగు తో పాటు కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించింది రచన. అయితే తెలుగులో మాత్రం అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది.

చిరంజీవితో కలసి నటించినా కలసిరాని కెరీర్…
ఒడియా, హిందీ వంటి బాషలలో మంచి పేరు సంపాదించుకున్నా కూడా తెలుగులో మాత్రం స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వంటి అగ్ర కాథానాయకుల తోనే కాకుండా మోహన్ బాబు, జగపతిబాబు లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది రచన. కానీ అవేవీ రచనని స్టార్ హీరోయిన్‌ని చేయలేకపోయాయి. చిరంజీవి తో హీరోయిన్ గా చేస్తే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అప్పట్లో అనుకునేవారు. చిరంజీవి సరసన చేసినా కూడా రచన కి అదృష్టం కలసి రాలేదు.

కాస్త గ్లామర్ గా కనిపించే పాత్రలు చేస్తే కలిసివస్తుంది అనుకుంటే అలా కూడా రచనకు కలసి రాలేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా అందులో రచన చేసిన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం కారణంగానే కెరీర్ అంతగా కలసిరాలేదు అంటారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలో చేసినా అది సెకండ్ హీరోయిన్ పాత్ర అవ్వడం, అందులోను ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం తో మెగాస్టార్ తో చేసినా కలసిరాలేదు. అందులోను మెగాస్టార్ సినిమా అంటే హీరోయిన్ కాస్త గ్లామర్ గా, ఉంటుందని ఊహించడం వంటి కారణాలు రచన కెరీర్ మీద దెబ్బ పడిందని అనుకోవచ్చు.
































