Categories: FeaturedMovie News

Nookaraju & Asiya : ప్రేమను నిరూపించుకోడానికి సాహసం చేసిన నూకరాజు.. క్యాష్ షోలోనే పెళ్లి??

Nookaraju & Asiya : ప్రేమ కోసం ఏదైనా చేస్తామని చెప్పడం వేరు చేయడం వేరు. కొంతమంది ప్రేమించిన వారి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. ప్రేమ కున్న గొప్పతనం అలాంటిది మరి. అంత వరకు తెలియని వ్యక్తిని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడటం, వారికోసం జీవితం మొత్తం ఇచ్చేయడం ప్రేమ కున్న పవర్. అలా ప్రేమ కోసం జబర్దస్త్ నూకరాజు సాహసమే చేసాడు. పటాస్ సమయంలో పరిచయమైన ఆసియా, నూకరాజులు ప్రేమించుకుంటున్న విషయం ఈ మధ్యనే శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో బయటకు వచ్చింది. పటాస్ షో సమయంలో నూకరాజు,ఆసియా, ఫైమ, ప్రవీణ్ ల మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీళ్ళ ప్రేమలు ఈవెంట్లలో అందరికీ తెలిసిపోయాయి. కానీ నూకరాజు, ఆసియా మాత్రం శ్రీ దేవి డ్రామా కంపెనీ ద్వారా ఓపెన్ అయ్యారు. నా ప్రాణం ఇస్తా అంటూ నూకరాజు, ఆసియా కాళ్ళు పట్టుకుని కష్టపెట్టినందుకు సారీ చెప్పి మరీ ఐ లవ్ యూ చెప్పాడు షోలో. ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు క్యాష్ షోలో తనకు ఎంత ప్రేముందో ఆసియా మీద నిరూపించుకున్నాడు.

చేతిలో కర్పూరం వెలిగించుకుని మరీ…

క్యాష్ షో.. సుమ యాంకర్ గా ప్రతి వారం కొత్త సెలబ్రిటీలతో వచ్చే క్యాష్ లో ఈ వారం ఆసియా, నూక రాజు వచ్చారు. షోలో భాగంగా సుమ వారి ప్రేమ గురించి అడుగుతూ నీది నిజమైన ప్రేమ అయితే చేతిలో కర్పూరం వెలిగించుకో అని అనగానే నూకర్శజు నిజంగానే చేతిలో కర్పూరం వెలిగించుకుని అది చివరవరకు మండే వరకు ఉన్నాడు. ఓ వైపు ఆసియా కన్నీళ్లతో వద్దు వద్దు అంటున్నా ఏ మాత్రం చేయి కాలుతుందని లెక్కచేయకుండా నూకరాజు ప్రేమ కోసం ఈ సాహసం చేసాడు. ఇక సుమ ఇప్పుడే ఆసియా ను పెళ్లి చేసుకుంటావా అని అడుగగా తాళి తీసి కట్టబోయాడు.

అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన చాలా మంది నెటిజన్స్ రెండు వర్గాలుగా చిలిపోయి కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది షో కోసం రేటింగ్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కువయ్యాయి ఇలాంటివి అంటుంటే మరికొంతమంది నూకరాజు ది నిజమైన ప్రేమ అంటూ మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈటీవీ వాళ్లకు మరో జంట దొరికింది లవ్ సింబల్స్ వేసి ఈవెంట్స్ లో చూపించడానికి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago