OTT Stars: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర హీరో హీరోయిన్లుగా కొనసాగిన వారందరూ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన వారందరూ తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి ఓటీటీలు మంచి మార్గాలుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఓటీటీల ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లు తెరకెక్కడంతో పెద్ద ఎత్తున సెలెబ్రెటీలందరూ వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలు సైతం వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేయగా ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన కొంతమంది తారలు కూడా వెబ్ సిరీస్లకు కమిట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే జయం సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నటి సదా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె వరుసగా తెలుగు తమిళ సినిమాలలో నటించి గుర్తింపు పొందారు.
ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సదా అనంతరం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో జడ్జిగా సందడి చేశారు.అయితే ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన సదా పలు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈమె బాటలోనే లయ సైతం ఓటీటీ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈవివి సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఆర్యన్ రాజేష్ కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ప్రస్తుతం ఈయన కూడా వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…