Categories: FeaturedMovie News

Nandamuri Kalyan Ram : ఆ సినిమాను చాలా నమ్మాను… కానీ నన్ను కోలుకోలేని విధింగా దెబ్బతీసింది : కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram: నందమూరి నట వారసుడిగా నందమూరి హరికృష్ణ వారసుడు కళ్యాణ్ రామ్ 2003 లో వచ్చిన ‘తొలి చూపులోనే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. 2005 లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అత్తనొక్కడే’ సినిమాతో మంచి విజయాన్ని అందికున్నాడు. కెరీర్ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ‘బింబిసార’. ఆగష్టు 5 న ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వస్తోంది. అయితే విడుదల సమయం దగ్గర ఉండటం తో ప్రమోషన్లలో ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో లోనే కళ్యాణ్ రామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

సినిమాలకు దూరమవుదామా అని అనిపించిందని…

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తన కెరీర్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. సినిమాలో హిట్లు ప్లాపులు సర్వ సాధారణం. హిట్లు వస్తాయి, వరుస అవకాశాలు క్యూ కడతాయి. అదే ప్లాప్ వస్తే పలకరించే వారు ఉండకపోవడమే కాదు ఆర్థికంగా కూడా చాలా దెబ్బ పడుతుంది. ఇలానే తన కెరీర్ లో కూడా ఒక సినిమా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని కళ్యాణ్ రామ్ చెప్పుకోచ్చారు. ఆ సమయంలో కుటుంబం అండగా నిలబడింది అని చెప్పారు.

నా కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కథను బాగా నమ్మి భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ఓం (3డీ). అయితే ఆ సినిమా విషయంలో నా అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఓం సినిమా కథను నేను చాలా నమ్మి తీసాను. అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ఫలితం వచ్చింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్ కు లోనవ్వడమే కాకుండా సినిమాలకు దూరమవుదామా అన్న ఆలోచన కూడా వచ్చింది. అని కళ్యాణ్ రామ్ చెప్పుడు. ఆర్థికంగా కూడా ఆ సినిమా నన్ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తరువాత పటాస్ సినిమాతో వచ్చిన నష్టం పోయిందని చెప్పారు. అయితే ఇపుడు వస్తున్న బింబిసార మీద చాలా నమ్మకం ఉందని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago