Venu Thottempudi : 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు వేణు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మాత్రమే కాకుండా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వేణు టాలీవుడ్లో వెంకటేష్ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా చేరువ అయ్యాడు. అయితే వేణు కెరీర్ లో మంచి విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. 2013 లో వచ్చిన ‘రామాచారి’ సినిమా తరువాత సినిమాలకు దూరం అయ్యి అమెరికాలో స్థిరపడిన వేణు, చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
లయ గురించి నాన్నతో మాట్లాడితే అయన ఒకటే అన్నాడు…
చాలా విరామం తరువాత సినిమాలో కనిపించిన వేణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో వేణు తన సినీ ప్రయాణం గురించి, మొదటి సినిమా తాను చేయడానికి ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్నారు. మొదట తన స్నేహితుడు శ్యామ్ ప్రసాద్ ఎస్ పి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి, నేను హీరోగా ఒక సినిమా చేయాలని, చంద్ర సిద్దార్థ దర్శకత్వం కాగా ఆర్ పి పట్నాయక్ సంగీతం అని అనుకోగా, త్రివిక్రమ్ ‘స్వయంవరం’ కథని చెప్పడం నచ్చడం తో మొదలు పెట్టడం జరిగిందని చెప్పాడు.
అయితే కొన్ని కారణాల వలన చంద్ర సిద్దార్థ తప్పుకోవడం తో విజయం భాస్కర్ దర్శకత్వం తో మళ్ళీ కొత్తగా ప్రాతంభించాము అని చెప్పారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక హీరోయిన్ ని మార్చాలని అనుకోని మా నాన్నకి చెప్పగా ఆయన ఇపుడు లయ గురించి ఆలోచిస్తున్నట్టు నీ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది నీకు అని అన్నారు. దాంతో లయనే హీరోయిన్ గా ఫిక్స్ అవుదాం అని డైరెక్టర్ తో మాట్లాడినట్లు అయన చెప్పారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక మాత్రం ఎన్ని అవార్డులు గెలుచుకుందో, ఎంత విజయం సాధించిందో మనకందరికి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…