Natti Kumar : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ సినిమా అంతర్గత సమస్యల పరిష్కారం కోసం, ఆ వివాదాలను పరిష్కరించడానికి షూటింగ్ లను బంద్ చేయాలని నిర్మాతల గిల్డ్ నిర్ణయం తీసుకోవడంతో ఒకసారిగా ఇండస్ట్రీ లో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. అయితే అసలు నిర్మాతల గిల్డ్ కి ఏం అధికారం ఉంది అంటూ కొంతమంది ప్రొడ్యూసర్స్ వాదిస్తున్నారు. వారి స్వప్రయోజలనాల కోసం సినిమా ఇండస్ట్రీ కి నష్టం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ మీద ఇప్పటికే అశ్వినిదత్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారు స్పందించగా ఇప్పుడు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కూడా స్పందించారు. నిర్మాత గిల్డ్ కి వ్యతిరేకంగా మాట్లాడారు.
షూటింగులు బంద్ చేసే హక్కు మీకెక్కడిది…
హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే నిర్మాతలకు నష్టాలు తగ్గుతాయని మాట్లాడుతున్నారు, అసలు హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించడానికి ముందుకు రాకపోతే శాశ్వతంగా సినిమా షూటింగ్ బంద్ చేస్తారా, అయినా అసలు ఎవరిచ్చారు మీకు షూటింగ్ బంద్ చేసే హక్కు.. ఎవరిచ్చారు అంటూ ఫైర్ అయ్యారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని సీఎం దగ్గరికి వెళ్లి మరీ అడుగుతారు. మరి చిన్న నిర్మాతలు ఏమవ్వాలి. చిన్న సినిమాలను అంత టికెట్ రేట్ పెట్టి ప్రేక్షకులు థియేటర్ లో చూడరు. మరి ఈ విషయం మీకు తెలియదా అంటూ కామెంట్స్ చేసారు నట్టికుమార్. తగ్గాలిసింది హీరోల రెమ్యూనరేషన్స్ కాదు, ప్రొడక్షన్ కాస్ట్. అది తగ్గితే సినిమా బడ్జెట్ తగ్గుతుంది అపుడు నిర్మాతకు నష్టాలు తగ్గుతాయి. అయినా సినిమా షూటింగులు బంద్ చేస్తే సమస్యలు పరిష్కారమావుతాయా, చిన్న సినిమా షూటింగులు బంద్ అయితే ఇక అంతే మళ్ళీ మొదలు కావు. కార్మికులు, చిన్న నిర్మాతలు నష్టపోతారు.
పెద్ద సినిమా షూటింగులు ఆగినా ఏం అవుతుంది. ఇపుడు బాలయ్య బాబు సినిమా షూటింగ్ కర్నూల్ లో జరుగుతోంది. కానీ సినిమా షూటింగుల బంద్ వల్ల ఆగిపోయింది. దీనివల్ల ఎవరికి నష్టం, కార్మికులకు మాత్రమే. అయినా ఒక పెద్ద సినిమా షూటింగ్ ఆగినా కొన్ని వారాల తరువాత మళ్ళీ మొదలు పెడతారు. కానీ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి.. ఒకసారి వాయిదా పడ్డాయాంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి సినిమా శాశ్వతంగా ఆపేస్తారు. దీనివల్ల ఎంతోమంది కార్మికులు నష్టపోతారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం సినిమా షూటింగ్ బంద్ చేయడం తప్పు అంటూ నట్టి కుమార్ ఫైర్ అయ్యాడు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…