Categories: FeaturedMovie News

Suman : వాళ్ళ పని డబ్బులు మాత్రం పెట్టి వెళ్లి పడుకోవడం కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో సుమన్

Suman : సుమన్.. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేరకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటిదాకా దాదాపు 150 సినిమాలకు పైగా నటించాడు. 1979 లో నీచల్ కులం అనే మలయాళం సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మాత్రమే కాకుండా 2004 లో ‘డెత్ అండ్ ఆక్సిస్’ అనే హాలీవుడ్ చిత్రం లో కూడా కనిపించారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, రామాదాసు లో రాముడిగా నటించి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక శివాజీ సినిమాలో విలన్ గా కూడా అలరించాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న నిర్మాత సంఘాలు తీసుకున్న స్ట్రైక్ నిర్ణయం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు.

డబ్బులు పెట్టి వెళ్లి పడుకుంటే ఎలాగ, దగ్గరుండి చూసుకోవాలి…

ఆర్టిస్టులు రేట్లు తగ్గించాలని, ప్రొడక్షన్ ఖర్చులు పెరుగుతున్నాయని, ఓటీటీ ల వళ్ళ నష్టం జరుగుతోందని నిర్మాతలు స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై చాలా మంది ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో సుమన్ తన అభిప్రాయాన్ని తెలియజేసారు. షూటింగ్ సమయాన్ని పెంచాలని, రెండు రోజులు చేయాల్సిన పనిని ఒక రోజులో పూర్తిచేయాలని అయన చెప్పారు. హీరోల రెమ్యూనరేషన్ నిర్మాతలు మాట్లాడి కాస్త తగ్గించే విదంగా మాట్లాడాలని అయన సూచించారు.

నిర్మాతలు డబ్బులు మాత్రం పెట్టి అంతా మేనేజర్ మీద వదిలేసి వెళ్లి పడుకోవడం కాదు, నిర్మాతలు అప్పట్లో రామానాయుడు గారు ఆచరించిన విధానాలను ఫాలో అవ్వాలని చెప్పుకొచ్చారు. టికెట్ల రేట్లు తగ్గిస్తే బైయ్యర్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అందరూ పద్దతిగా రోజుకు 9 గంటల పనితనాన్ని అలవాటు చేసుకోవాలి అని అయన సూచించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago