Tag Archives: Balagam Movie

Balagam Movie: తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష పత్రాలలో బలగం ప్రశ్న… అస్సలు తగ్గని బలగం క్రేజ్!

Balagam Movie: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఊహించని దానికన్నా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది.

ఈ విధంగా బలగం సినిమా ఎంతో సక్సెస్ సాధించింది అయితే తెలంగాణలో ఏదైనా సర్కారు ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నట్లయితే తప్పకుండా ఆ పరీక్ష పత్రాలలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు రావడం గమనార్హం గతంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష పత్రాలలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షలను నిర్వహించారు. ఈ గ్రూప్ 4పరీక్ష పత్రాలలో భాగంగా మరోసారి బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న రావడంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇలా గ్రూప్ ఫోర్ పరీక్ష పత్రంలో తమ సినిమా ప్రశ్న రావడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఏ ప్రశ్న పరీక్ష పత్రాలలో వచ్చినది అనే విషయానికి వస్తే…

Balagam Movieహర్షం వ్యక్తం చేస్తున్న చిత్ర బృందం…

బలగం చిత్రానికి సంబంధించిన క్రింది జతలలో ఏవి సరిగా జతపరచబడినవి? అనే ప్రశ్నకు ఏ. దర్శకుడు : వేణు యెల్దండి, బి. నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్‌ రెడ్డి సి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, డి. కొమురయ్య పాత్రను పోషించినవారు : అరుసం మధుసూదన్. దీనికి సమాధానం ఏ,బీ,సీ, ఈ విధంగా ఈ సినిమాకు సంబంధించి ఈ ప్రశ్నను అడగడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Balagam Movie: కానిస్టేబుల్ పరీక్ష పత్రంలో బలగం సినిమా ప్రశ్న..?

Balagam Movie: ఇటీవల చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బలగం సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. దీంతో ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వరించాయి.

ఇక ఈ సినిమాలోని నటీనటులందరూ కూడా తమ పాత్రలలో జీవించారు. ఇప్పటికీ పల్లెల్లో తెరమీద ఈ సినిమా కనిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా బలగం సినిమా గొప్పదనాన్ని చాటే మరొక సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఇటీవల తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఈ కానిస్టేబుల్ పరీక్షలలో బలగం సినిమా గురించి కూడా ఒక ప్రశ్న ఉంది. ఇలా కానిస్టేబుల్ పరీక్షలు బలగం సినిమా గురించి ప్రశ్న అడగడంతో ఈ సినిమాకు ఉన్న గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.

ఇటీవల మార్చి 2023లో నిర్వహించిన ఓనికో ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో బలగం సినిమాకి ఒక అవార్డు దక్కింది. ఈ క్రమంలో ఓనికో ఫిల్మ్ అవార్డుల జాబితాలో ఏ విభాగంలో బలగం సినిమాకి పురస్కారం లభించింది అనే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకి ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇక ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం.

Balagam Movie: ఎన్నో పురస్కారాలు అందుకున్న బలగం…

ఇటీవల జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం లో ఉత్తమ నాటకం అనే విభాగంలో బలగం సినిమా అవార్డు అందుకుంది. ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాల గురించి ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం మనుషుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గిపోయి రక్తసంబంధాలను కూడా మర్చిపోతున్నారు. ఈ తరుణంలో బలగం సినిమా అందరికీ కనువిప్పు కలిగించింది.

Balagam Movie: బలగం డైరెక్టర్ ముందే సినిమాలోని ఎమోషన్ సీన్స్ ను కామెడీ చేశారుగా… ఫైర్ అవుతున్న నెటిజన్స్!

Balagam Movie: ఇటీవల పల్లెటూరి నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ అద్భుతమైన సినిమాకి కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు.

u

ఇంతకాలం ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించి ఆకట్టుకోవడమే కాకుండా జబర్దస్త్ ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన వేణు బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు.
అయితే తాజాగా ఈ అద్భుతమైన సినిమాని వేణు కళ్ళముందే అపహాస్యం చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో బలగం సినిమా స్పూఫ్ తో స్కిట్ చేశారు.

తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కి వేణు అతిథిగా హాజరయ్యారు. దీంతో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ బలగం సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా వేణు ముందే కామెడీ చేశారు.
తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కలసి స్కిట్ చేశారు. అలాగే ఈ స్కిట్ చివరిలో యాంకర్ రష్మి కూడా పాల్గొనింది.

Balagam Movie: స్కిట్ లో భాగమైన రష్మీ…


బలగం సినిమాలోని క్లైమాక్స్ లో పాట ఉన్నట్లుగా ఈ స్కిట్ చివర్లో కూడా జబర్దస్త్ ప్రవీణ్ పాట పడుతూ హైపర్ ఆది, రష్మీ ఇలా ఒక్కొక్కరి గురించి కామెడీగా వివరించి అందరినీ నవ్వించాడు. ఈ స్కిట్ చూసి కొందరు నవ్వుకుంటుంటే మరి కొంతమంది మాత్రం దర్శకుడి ముందే సినిమా గురించి ఇలా ఆపహేళన చేయడంతో మండిపడుతున్నారు.

Chiranjeevi: బలగం సినిమా మొగిలయ్యకు సాయం చేసిన చిరంజీవి..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా అవసరమైన వారికి సహాయ సహకారాలు చేస్తూ మెగాస్టార్ గా అందరి మనసుల్లో నిలిచిపోయారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే చిరంజీవి ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో తాజాగా చిరంజీవి మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇలాంటి ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా చిరంజీవి తాను చేసిన సహాయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన బలగం సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఉన్న ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి ‘ అనే పాట సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అయితే ఒక్క పాటతో మంచి గుర్తింపు పొందింన మొగిలయ్య దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.మొగిలయ్య అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న చిరంజీవి డైరెక్టర్ వేణు కి ఫోన్ చేసి మొగిలయ్య ఆరోగ్యం గురించి వివరాలు ఆరా తీసి వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.

Chiranjeevi: ఖర్చు మొత్తం భరిస్తానన్న చిరు..’


మొగిలయ్య దంపతులు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండడంతో కంటిచూపు మందగించింది. దీంతో అతనికి కంటి చూపు తిరిగి వచ్చేలా చికిత్స కోసం ఎంత ఖర్చైనా సరే తానే భరిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చినట్లు వారు వెల్లడించారు. దీంతో మొగిలయ్య దంపతులతో పాటు అభిమానులు కూడా చిరంజీవి చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Balagam Movie: బలగం సినిమా కోసం నా ఇంటిని ఇస్తే వేణు ఒక థాంక్స్ కూడా చెప్పలేదు… సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంటి ఓనర్!

Balagam Movie: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం.సినిమాలు దమ్ముంటే చిన్న సినిమా ఆయన పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.ఇలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతాలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా ఎక్కువ భాగం సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ఉన్న ఇల్లు కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఉంది. అయితే తాజాగా ఈ ఇంటి ఓనర్ డైరెక్టర్ వేణు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డైరెక్టర్ వేణు ది మా ఊరే కావడంతో ఒకరోజు తన వద్దకు వచ్చి దిల్ రాజు సినిమా అవకాశం ఇచ్చారు మీ ఇల్లు నాకు కావాలి అని అడిగారు.ఇలా సినిమా కోసం ఇల్లు కావాలి అని అడగడంతో నెలన్నర రోజులపాటు నేను వేరే ఇంట్లో ఉండి తన ఇంటిని సినిమా షూటింగ్ కోసం ఇచ్చాను.సినిమా షూటింగ్ జరిగే ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే షూటింగ్ సమయంలో ఇంటిని తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పారు.

Balagam Movie: డబ్బులు కూడా ఇస్తామన్నారు…

ఇప్పటివరకు తనకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్ వేణు కనీసం ఒక ఫోన్ చేసి తనకు థాంక్స్ కూడా చెప్పలేదని ఇంటి ఓనర్ రవీందర్రావు తెలిపారు.మేము డైరెక్టర్ వేణు నుంచి ఇలాంటివి ఏమీ ఆశించలేదు కానీ ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Comedian Venu: ఎట్టకేలకు జబర్దస్త్ వీడడం పై నోరు విప్పిన వేణు… ఆ కారణంతోనే బయటకు వచ్చానంటూ కామెంట్స్!

Comedian Venu: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎందరో స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఇందులో సందడి చేసినటువంటి వారిలో వేణు ఒకరు. వేణు టీం లీడర్ గా అద్భుతమైన స్కిట్ ఫర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వేణు ఉన్న ఫలంగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు..

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వేణు బయటకు రావడంతో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఈయన కూడా బయటకు వచ్చారని అందరూ భావించారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వేణు పెద్దగా ఇతర కార్యక్రమాలలో కనిపించలేదు. అయితే ఈయన దర్శకుడిగా మారి తాజాగా బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టి రావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల వారితో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని మనస్పర్ధలు కారణంగా బయటికి రాలేదని తెలియజేశారు.

Comedian Venu: సినిమాలపై పిచ్చే కారణం…

సినిమాలపై ఉన్న పిచ్చే తనని జబర్దస్త్ నుంచి బయటకు నడిపించిందని తెలిపారు.ఎలాగైనా సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన కసి అని తెలిపారు.అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సినిమా వేటలో పడ్డానని జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు పేరు డబ్బు వస్తున్న కూడా వదిలేసి బయటకు వచ్చానని, ,అంతకుమించి తాను జబర్దస్త్ వదిలి రావడానికి మరే కారణాలు లేవంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Balagam Movie: మొదటి రోజే కాపీ వివాదాలను ఎదుర్కొంటున్న బలగం… అసలు ఈ బలగం కథ ఎవరిదీ!

Balagam Movie: సాధారణంగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయాలను అందుకుంటాయి. అలాగే కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున కాపీ వివాదాలను కూడా ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న సినిమాగా విడుదలై ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి బలగం సినిమా మొదటి రోజే కాపీ వివాదంలో చిక్కుకుంది.

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం బలగం. తెలంగాణ యాసలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా విడుదలైన అనంతరం ఈ సినిమా అంచనాలను చేరుకోవడమే కాకుండా కాపీ వివాదాలను కూడా ఎదుర్కొంటుంది.

బలగం సినిమా కథ నాదేనని నా కథను కాపీ కొట్టి ఈ సినిమా చేశారు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గడ్డం సతీష్ మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో తాను పచ్చికి అనే కథను రాసాను. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యాసకు నిరాధారణకు గురికావడంతో.. ఈ కథ ప్రచూరణకు నోచుకోలేదు.

అప్పటి నుంచి నేను తెలంగాణ యాసలో కథలు రాయాలని నిర్ణయించుకున్నాను.2014వ సంవత్సరంలో నమస్తే తెలంగాణ పత్రికలో బతుకమ్మ మ్యాగ్జైన్లో అచ్చు వేసారని ఈయన తెలిపారు. ఇక ఈ కథ ఏంటి అనే విషయానికి వస్తే గత కొన్ని దశాబ్దాలుగా మనుషులు వ్యవహరిస్తున్నటువంటి సాంప్రదాయాల విషయానికి వస్తే ఒక మనిషి చనిపోతే ఆయన చనిపోయిన మూడవరోజు ఐదవ రోజు 11వ రోజు కర్మలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పక్షులకు ఆహారం పెడతారు.

Balagam Movie: బలగం సినిమా క్రెడిట్ నాకే ఇవ్వాలి…

ఇలా పెట్టినటువంటి ఆహారాన్ని కాకులు వచ్చి కనుక తింటే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని విశ్వసిస్తారు. ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఫాలో అవుతూ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మకాండలో ఇలా చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కథ రాశానని అయితే నేను రాసిన ఈ కథని 90% బలగం సినిమాలో పెట్టి 10% మాత్రమే మార్పులు చేశారు అంటూ గడ్డం సతీష్ ఆరోపించారు.ఈ విషయంపై దిల్ రాజు చొరవ చూపించి ఈ కథ క్రెడిట్ మొత్తం తనకు ఇప్పించాలని అలాకాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ సతీష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.