Tag Archives: bjp party

Madhavi Latha: పెళ్లికి వయసు మాత్రమే సరిపోదు అంటూ పెళ్లికి సిద్ధమైన మాధవి లత… వరుడు ఎవరంటే?

Madhavi Latha:మాధవి లత పరిచయం అవసరం లేని పేరు తెలుగులో నచ్చావులే సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.ఈ విధంగా మాధవి లత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి తరచూ మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల పట్ల ఈమె మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి మాధవి లత బిజెపి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ రాజకీయాల పరంగా కూడా చాలా చురుగ్గా ఉండేవారు.

ఈ విధంగా మాధవి లత రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు. గతంలో పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ పెళ్లి చేసుకోవడానికి వయసు ఒకటే సరిపోదు పెళ్లి చేసుకోవడానికి మనం శారీరకంగా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్ చేసిన కొద్ది రోజులకే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Madhavi Latha: వరుడు ఏం చేస్తారో తెలుసా…

మాధవి లత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.ఇలా పెళ్లి గురించి ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఈమె పెళ్లికి సిద్ధమయ్యారు అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈమె పెళ్లి ఫిక్స్ అయిందన్న విషయం తెలియడంతో వరుడు ఎవరు ఏం చేస్తారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వివరాలను ఈమె వెల్లడించనున్నారు.

Madhavilatha: ఆ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానంటూ ఓపెన్ అయినా నటి మాధవి లత… వీడియో వైరల్!

Madhavilatha: నచ్చావులే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి మాధవి లత. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం స్నేహితుడా సినిమాలో నటించారు. అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మాధవి లత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తుంటారు.

ఇలా ఈమె మరోవైపు బిజెపి పార్టీలో చేరి పెద్ద ఎత్తున రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే మాధవి లత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తాను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అంటూ ఓపెన్ అయ్యారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఒక వ్యక్తిని కలిశానని ముందు తనని అర్థం చేసుకోవాలని అనంతరం తన తల్లిదండ్రులకు నా తల్లిదండ్రుల అనుమతి పొందాలని అయితే ఇది అంత త్వరగా జరిగే విషయం కాదని మరొక ఏడాది పాటు ఎదురు చూడాలని తెలిపారు.అయితే పెళ్లి ఎప్పుడు అని మాత్రం ఎవరూ తనని అడగవద్దని వెల్లడించారు. అన్ని విషయాలు తానే అందరికీ చెబుతానని ఈమె తెలిపారు.

Madhavilatha తెలుగు వ్యక్తి మాత్రం కాదు…


ఇక తాను కలిసిన వ్యక్తి తెలుగు వ్యక్తి మాత్రం కాదని, నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఈ విషయంలో తగ్గేదే లేదు అంటూ ఈ సందర్భంగా మాధవి లత చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా ఈమె డేటింగ్ లో ఉన్నానంటూ తెలియ చేయడంతో ఈమె డేటింగ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

NTR: ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది.. రాజకీయాలలోకి వచ్చి తప్పు చేయొద్దంటున్న ఫ్యాన్స్?

NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇకపోతే గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాలలోకి రావాలని ఈయన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెడితేనే పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని అభిమానులు భావించి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి రావాలని కోరారు.

ఇలా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఎంత కోరుకున్న ఈయన మాత్రం రాజకీయాల గురించి ఏ మాత్రం నోరు విప్పలేదు.అయితే ఎవరు ఊహించని విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఏకంగా ఎన్టీఆర్ కి అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్టీఆర్ తో భేటీ కావడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు దారి తీసింది. ఈ విధంగా ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

ఒకవేళ అమిత్ షా ఎన్టీఆర్ ను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారా అనే విషయం తెలియడంతో అభిమానులు ఈ విషయంపై స్పందించి పొరపాటున కూడా అలాంటి తప్పు చేయవద్దని అభిమానులు తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ కి సూచనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కనుక బీజేపీ పార్టీలోకి వెళితే ఈయన వ్యక్తిగతంగా ఇతర పార్టీ నాయకులకు టార్గెట్ అవుతారు. తద్వారా ఈయనకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే పొరపాటున కూడా రాజకీయాలలోకి వద్దంటూ అభిమానులు సూచిస్తున్నారు.

NTR: రాజకీయాలలోకి మాత్రం వద్దు..

ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఈయన డిమాండ్ చేస్తే ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారని ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైతే బాగుంటుందని రాజకీయాలలోకి వెళ్తే మాత్రం ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అభిమానులు ఈయన రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ రాజకీయాలలోకి మాత్రం వద్దని సూచనలు చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

Jeevitha Rajasekhar: తెలంగాణ ఎన్నికల పోటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జీవిత రాజశేఖర్..!

Jeevitha Rajasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా,దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోటీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న జీవిత తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఈమె మాట్లాడుతూ తాను ఇద్దరు బిడ్డల తల్లిగా ఒక మహిళకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో మనందరికీ తెలిసిందే.అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడగలిగే వ్యక్తి అని తాను బిజెపి పార్టీలోకి చేరానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని జీవిత వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో ఏ ప్రాంతం నుంచి అయినా తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని,పార్టీ తరఫున క్రియాశీలకంగా మారి పార్టీ కార్యక్రమాలకు తాను విధిగా హాజరవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు.

Jeevitha Rajasekhar: బండి సంజయ్ కు మద్దతుగా జీవిత…

బీజెపీ పార్టీలోకి జీవిత రాజశేఖర్ బండి సంజయ్ కు మద్దతుగా తాను ఈ పాదయాత్రలో పాల్గొన్నానని ఈమె వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణ రాజకీయాల గురించి నటి జీవిత రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈమె కోరిక మేరకు వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేయడానికి అధిష్టానం అనుమతి తెలుపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.