Madhavi Latha:మాధవి లత పరిచయం అవసరం లేని పేరు తెలుగులో నచ్చావులే సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.ఈ విధంగా మాధవి లత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి తరచూ మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల పట్ల ఈమె మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి మాధవి లత బిజెపి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ రాజకీయాల పరంగా కూడా చాలా చురుగ్గా ఉండేవారు.
ఈ విధంగా మాధవి లత రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు. గతంలో పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ పెళ్లి చేసుకోవడానికి వయసు ఒకటే సరిపోదు పెళ్లి చేసుకోవడానికి మనం శారీరకంగా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్ చేసిన కొద్ది రోజులకే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
మాధవి లత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.ఇలా పెళ్లి గురించి ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఈమె పెళ్లికి సిద్ధమయ్యారు అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈమె పెళ్లి ఫిక్స్ అయిందన్న విషయం తెలియడంతో వరుడు ఎవరు ఏం చేస్తారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వివరాలను ఈమె వెల్లడించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…