Tag Archives: business loan

ఆ స్కీమ్ ద్వారా రూ. 25 లక్షలు రుణం పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

కరోనా మహమ్మారి దేశ ప్రజల ఆలోచనలను, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెద్దపెద్ద వ్యాపారాలు చేసిన వాళ్లు సైతం కోట్ల రూపాయలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది. అయితే కేంద్రం దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక పథకాన్ని అమలు చేస్తోంది.

ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 25 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసి ప్రయోజనం పొందవచ్చు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందాలని అనుకునే వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తూ వ్యాపార రంగంలో కెరీర్ ను ఎంచుకునే వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత సాధిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చు. చాలా సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమలవుతున్నా కరోనా విజృంభణ వల్ల ఈ స్కీమ్ గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ వెబ్ సైట్ ద్వారా కేంద్రం నుంచి రుణం పొందిన వాళ్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్లు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందలేరు. కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేస్తే మంచిది.

నెలకు లక్షల్లో సంపాదించే బిజినెస్ ఇదే.. తక్కువ డబ్బులు ఉన్నా..?

మనలో చాలామంది వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం సంపాదించేలా ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు పౌల్ట్రీ బిజినెస్ ను ప్రారంభించడం ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కూడా అవసరం లేదు.

దేశంలో రోజురోజుకు గుడ్ల వినియోగం పెరుగుతోంది. కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ అమలైన సమయంలో దేశంలో గుడ్ల వినియోగం రెట్టింపైంది. అందువల్ల ప్రస్తుతం పౌల్ట్రీ ఫార్మింగ్ బిజినెస్ ద్వారా తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ ను ప్రారంభించాలంటే పౌల్ట్రీ రంగంపై కనీస అవగాహన ఉండాలి. మన పెట్టుబడిని బట్టి బిజినెస్ ను ప్రారంభించడానికి అవసరమైన స్థలం ఉండాలి.

పౌల్ట్రీ బిజినెస్ ను ప్రారంభిస్తే రెండు రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎగ్స్ ప్రొడక్షన్, బాయిలర్ బ్రీడింగ్ లాంటి విషయాల గురించి అవగాహనను పెంపొందించుకుని ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. కేంద్రం నుంచి బ్రాయిలర్ ప్లస్ స్కీమ్ ద్వారా ఈ బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు కొన్ని బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి.

ఈ బిజినెస్ కు అయ్యే ఖర్చులో 75 నుంచి 80 శాతం బ్యాంకుల నుంచి రుణంగా పొందే అవకాశం ఉంటుంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కొన్ని బ్యాంకులు పౌల్ట్రీ బిజినెస్ కు రుణాలు ఇస్తున్నాయి. బిజినెస్ పై ఆసక్తి ఉన్నవాళ్లు బ్యాంకును సంప్రదించి రుణం పొందే అవకాశం ఉంటుంది.