Tag Archives: committed suicide

Choreographer Chaitanya: ఆర్థిక సమస్యలతో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య… వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో!

Choreographer Chaitanya: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ చైతన్య తాజాగా నెల్లూరు క్లబ్ హోటల్లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఇలా ఈయన మరణ వార్త అందరిని ఎంతగానో కలిచి వేసింది. అయితే చైతన్య మరణించడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన చావుకు కారణాలను తెలిపారు.

ఈ సందర్భంగా చైతన్య ఈ సెల్ఫీ వీడియో ద్వారా కేవలం తనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల ద్వారానే తాను మరణిస్తున్నానని తెలిపారు.కొన్ని కారణాల వల్ల తాను అప్పు చేసానని అయితే ఆ అప్పును తీర్చడం కోసం మరొకచోట అప్పు చేశానని ఇలా అప్పులు పెరిగిపోవడం కాకుండా అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో భరించలేక చనిపోతున్నానని తెలిపారు.

తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తనని క్షమించమని తల్లిదండ్రులను అలాగే తోటి డాన్సర్లను కోరుకున్నారు. ఇక తనకు ఎంతో పేరు తీసుకు వచ్చిన ఢీ డాన్స్ షో కార్యక్రమానికి తాను రుణపడి ఉంటారని ఈ కార్యక్రమం తనకు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన సంపాదన మాత్రం ఇవ్వలేక పోయిందని తెలిపారు.

Choreographer Chaitanya: రెమ్యూనరేషన్ తక్కువ…


ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్లు తక్కువగా ఇస్తున్నారని జబర్దస్త్ లో అధిక రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటూ చైతన్య తెలిపారు. ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైతన్య ఆత్మహత్య చేసుకుని మరణించడంతో తోటి డాన్సర్లు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=nFfLfK6hZH0

Dil Raju: నా స్థానంలో ఇంకొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు… దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే తాజాగా ఈయన నిర్మాణంలో కోలీవుడ్ హీరో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన వరిసు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ సినిమా వల్ల భారీగా నష్టపోయానని ఈయన తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా 2015 వ సంవత్సరంలో అజ్ఞాతవాసి సినిమా నైజాం హక్కులను తాను కొనుగోలు చేశానని తెలిపారు.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తనకు ఫైనాన్షియల్ గా భారీ డ్యామేజ్ జరిగిందని దిల్ రాజు తెలిపారు.ఇక అదే ఏడాదిలోనే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా హక్కులను కూడా తాను కొనుగోలు చేశానని అయితే ఈ సినిమా కూడా తనకు తీవ్రమైన నష్టాలను మిగిల్చిందని దిల్ రాజు తెలిపారు. ఈ రెండు సినిమాల కారణంగా తాను భారీగా నష్టపోయానని తెలియజేశారు.

Dil Raju: ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు…


ఈ విధంగా ఫైనాన్షియల్ గా ఈ రెండు సినిమాలు బాగా దెబ్బ కొట్టడంతో నష్టాలు వచ్చాయి.ఇక నా స్థానంలో ఇతర నిర్మాతలు ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయే వారని ఈయన తెలిపారు. ఇక అదే ఏడాది తాను ఆరు హిట్ సినిమాలను అందుకోవడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగానని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tunisha Sharma: షూటింగ్ లొకేషన్లోనే ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి తునీషా.. పోలీసుల అదుపులోకి సహనటుడు!

Tunisha Sharma: బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిందీ సీరియల్స్ లో సీరియల్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తునీషా శర్మ షూటింగ్ లొకేషన్లో మేకప్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈమె ప్రస్తుతం అలీబాబా దస్తాన్ ఈ కాబూల్ సీరియల్ లో నటిస్తున్నారు.

ఈ సీరియల్ షూటింగ్ లోకేషన్ లోనే మేకప్ రూమ్ లో ఈమె ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించినటువంటి యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే తునిషా ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలియజేశారు. అయితే ఈమె మృతికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తులో భాగంగా ఈమె సహనటుడు షీజన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సీరియల్ జోడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరి ఫోటోలను మరొకరు షేర్ చేసుకోవడం వంటివి చేసేవారు.

Tunisha Sharma: పోలీసుల అదుపులోకి షీజన్ ఖాన్….


ఇక ఈమె అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కూడా షీజన్ ఖాన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.అయితే ఉన్నపలంగా ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతూ తన సహనటుడు ప్రియుడు అయినటువంటి షీజన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

Actress Annapoornamma: నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదే.. నటి అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్!

Actress Annapoornamma: ఎన్నో తెలుగు సినిమాల్లో నటిగా అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం ఎన్నో సినిమాలలోను బుల్లితెర కార్యక్రమాలలోనూ నటిస్తూ పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే నటి అన్నపూర్ణ పిల్లలు లేకపోవడంతో తన సమీప బంధువు అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు.

Actress Annapoornamma: నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదే.. నటి అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా సొంత కూతురిలా భావించిన తనకు ఏ లోటు లేకుండా పెంచారని అయితే తనకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన రెండు సంవత్సరాలకు తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నపూర్ణ తన కూతురు చనిపోవడానికి కారణం తెలిపారు.

Actress Annapoornamma: నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదే.. నటి అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్!

తాను దత్తత తీసుకొని పెంచినప్పటికీ తనకు ఏ లోటు లేకుండా పెంచానని అయితే తనని డాక్టర్ చేయాలన్నది తన కోరిక.కాకపోతే ఆ అమ్మాయికి చదువు రాకపోవడంతో పదవ తరగతి వరకు చదువుకుంది. తదుపరి పై తరగతులకు వెళ్ళమంటే తనకు చదువు ఇష్టం లేదని చెప్పగా మరి పెళ్లి చేసి పంపనా అంటే పెళ్లి చేయమని చెప్పింది. తన ఇష్టప్రకారమే తనకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను.

అత్తారింట్లో ఏవైనా కష్టాలు వచ్చాయేమో…

తాను కూడా అత్తవారింట్లో ఎంతో సంతోషంగా ఉంది తనకు ఏడాదిన్నర పాప ఉన్నప్పుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిపారు. అయితే తాను చనిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. నేను చిన్నప్పటినుంచి ఏ విషయమైనా ముక్కుసూటితనంగా మాట్లాడటమే కాకుండా కచ్చితంగా మాట్లాడేదాన్ని. తను బహుశా అత్తవారింట్లో ఏవైనా కష్టాలు పడ్డాదేమో, అదనపు కట్నకానుకల కోసం తనని బలవంతం చేశారేమో తెలియదు అయితే ఏ విషయాలు నా దగ్గర చెప్పలేదని ఈమె తెలిపారు.తను రేపు ఉదయం చనిపోతా అనగా ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చింది ఇక్కడే పడుకోమా అనగా లేదు ఇంటికి వెళ్తాను అమ్మ అని చెప్పి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఫ్యాన్ కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది అంటూ తెలిపారు.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

Online Game: తాజాగా చెన్నైలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నెలకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు సంపాదించే ఒక బ్యాంకు ఉద్యోగి భార్య పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మణికందన్ అనే వ్యక్తి పారూర్ లోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉండటంతో మణికందన్ కూడా మంచి జీతమే వస్తూ ఉండేది.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

అతను సంవత్సరానికి దాదాపు 28 లక్షల జీతం తీసుకునే వాడు. ఇక సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ లోని సెవెంత్ ఫ్లోర్ లో తన భార్య తారా, కొడుకు తరుణ్, మరొక కొడుకు దహన్ తో కలిసి నివసిస్తూ ఉండేవాడు.
ఈ మధ్యకాలంలో మణికందన్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆటకి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే లక్షల జీవితం వస్తున్నా కూడా, ఆ ఆట కోసం లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు. చివరికి అప్పుల పాలయ్యాడు.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

ఈ క్రమంలోనే ఒక రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్న మణికందన్ కు, అతని భార్య తారా కి మధ్య కి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు భార్యతో గొడవలు, మరొకవైపు అప్పులు తీసుకున్న వాళ్లు నుంచి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మణికందన్, క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

అప్పుల బాధలు తట్టుకోలేక..

ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 31న ఎప్పటిలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మణికందన్ కు అప్పు ఇచ్చిన అతని స్నేహితురాలు తరచూ ఫోన్ చేస్తుండటంతో.. ఏదో ఒక కారణం చెప్పాలి అని మణికందన్ తన భార్యతో ఫోన్ మాట్లాడించేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా మణికందన్ మొదట తన భార్యా పిల్లలను చంపి అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక జనవరి 1న వీరు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నట్టింట్లో తారా, ఆమె పిల్లలు విగతజీవులుగా కనిపించారు. మణికందన్ కిచెన్ లో ఉరి వేసుకొని కనిపించాడు. మణికందన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశాడు అని పోలీసుల విచారణలో తేలింది. మొదట భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపి, తన పిల్లలను గొంతునులిమి హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

కేసీఆర్ ను తిట్టారని.. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు..!

సీఎం కేసీఆర్ చేసే పనులను ఎత్తిచూపుతూ.. ప్రతి పక్షాలు దమ్మెత్తి పోస్తుండటం చూస్తున్నాం. అలాగే ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట కూడా వాస్తవమే. అయితే అధికారంలో ఎవరు ఉన్నా దాదాపు.. సీఎంపై నెగెటివ్ ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు సీఎం అంటే.. ఆ పార్టీ అంటే పడని వారు.

ఇక్కడ జరిగిన ఘటనలో దానికి విరుద్దంగా జరిగిందనే చెప్పాలి. సీఎం కేసీఆర్ కు ఉద్యమకాలం నుంచి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఉద్యమనాయకుడిగా పేరు పొంది రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అయితే ఇదే అభిమానులు కేసీఆర్ ను సోషల్ మీడియాలో తిడితే.. వెంటనే స్పందించి.. ఎదురుదాడికి పాల్పడే వారు ఉంటారు.

కేసీఆర్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఆయనకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది కూడా కేసీఆర్ కోసం. అదేంటి అనుకుంటుంన్నారా.. సీఎం కేసీఆర్ ను సోషల్ మీడియాలో మరియు బయట ప్రతిపక్షాలు తిడుతున్నారని.. రాజ్‌భవన్ ఎదుట సూర్యాపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాగార్జున ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాజ్ భవన్ కు వస్తుండగా.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు స్పందించి.. వెంటనే అడ్డుకొని సదరు వ్యక్తిని కాపాడారు. సీఎం కేసీఆర్ తనకు దేవుడు లాంటి వాడని.. ఎవరైనా కేసీఆర్ ను తిడితే తాను తట్టుకోలేనని.. అటు ప్రతిపక్షాలు తిడుతుంటే తట్టుకోలేకపోతున్నానని అతడు వాపోయాడు. కేసీఆర్ కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదని తాను అనుకున్నట్లు చెప్పాడు. అందుకే ఇటువంటి పనికి పూనుకున్నట్లు తెలియజేశాడు.

షాకింగ్.. రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే కొడుకు..

జబల్‌పూర్‌లోని బర్గి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సజయ్ యాదవ్ కుమారుడు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హతితాల్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదవ్ చిన్న కుమారుడు విభు యాదవ్(17) తన బెడ్రూంలో తన తలపై గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు అతని గదికి పరిగెత్తుకుని వెళ్లారు. వెళ్లే సరికి అతడు కిందపడి కనిపించాడు. అప్రమత్తమైన ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు అతడిని పరిశీలించి అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP), రోహిత్ కష్వానీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించామన్నారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేని అదనపు సూపరింటెండెంట్‌ రోహిత్‌ కేశ్వాని తెలిపారు.

ఈ ఘటన ప్రతీ ఒక్కరికీ తెలవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి వెలుపల గుమిగూడారు. పోలీసులు వాళ్లను కంట్రోల్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ కష్వానీ తెలిపాడు.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు.. నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంతమందికి మంచి ఉద్యోగం.. లక్షల్లో సంపాదన ఉన్నా సరిపోదు. ఇంకా ఏదో చేయాలి.. ఇంకా సంపాదించాలి అనే కోరిక, ఆశలు ఉంటాయి. ఇలా ఆశపడి నిరాశలో కుంగిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అతడు సాప్ట్ వేర్ ఉద్యోగిగా మంచి జీతంతో పనిచేస్తున్నాడు. పార్ట్ టైంలాగనే స్టాక్ మార్కెట్లో అతడు ఇన్ వెస్ట్ చేసి.. డబ్బులను సంపాదిస్తున్నాడు. రెండు చేతులా అతడు మూడు పువ్వులు.. ఆరు కాయలు లాగా అతడి జీవితం సాగిపోతుంది.

ప్రస్తుతం అతడు కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే పని చేస్తున్నాడు. అటు ఆ వ్యవహారం చూసుకుంటూ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో చిత్తూరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన భరత్‌ (23) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా చేస్తున్నాడు.

కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ సాప్ట్ వేర్.. తనను తాను ఆదుకోవడానికి ఆశతో ఇటీవల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మొదట కొద్దో గొప్పో లాభాలు బాగానే వచ్చాయి. కానీ ఓ రోజు దురదృష్టం అతన్ని వెక్కిరించింది. స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి.. ఆశగా రిటర్న్స్ కోసం ఎదురు చేశాడు. కానీ అతడికి అదృష్టం వరించలేదు.

పెట్టుబడి పెట్టిన డబ్బులు అన్నీ పోయాయి. దీంతో అతడు చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లాడు. కేఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. పోస్టు మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులు వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు.

దొంగతనం నెపంతో అతడి జుట్టు కత్తిరించారు.. అవమానం భరించలేక అతడు..

కొంతమంది చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడుతుంటారు. అంత సున్నితమైన మనస్థత్వం గలవారు ఉంటారు. చివరకు ఆత్మహత్యలు చేసుకొని వాళ్లను నమ్ముకున్న కుటుంబసభ్యులకు కన్నీళ్లని మిగుల్చుతారు. ఇటువంటి కోవలోకే చెందింది మరో ఘటన.. అతడు ఓ రోజు తన బంధువుల ఇంటికి వేరే గ్రామానికి వెళ్లాడు. అతడిని అక్కడ దురదృష్టం వెంటాడింది.

ఆ రోజే ఆ ఊరిలో ఓ దొంగతనం జరిగింది. ఎవరు చేశారో తెలియదు కానీ.. ఈ నెపం ఇతడిపై వేశారు. నువ్వే ఈ దొంగతనం చేశావంటూ అవమానించారు. అంతే కాకుండా జుట్టు మొత్తం కత్తిరించి ఇబ్బందులకు గురి చేశారు. ఆ అవమానం భారం భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిక‌నీర్‌లోని నోఖా ప‌ట్ట‌ణానికి చెందిన ఒమారాం జాట్ అనే 25 ఏళ్ల వ్యక్తి నాగౌర్ జిల్లాలోని ద‌వా గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడు వెళ్లిన రోజే దొంగతనం జరిగింది. ఆ దొంగతనం అతడే చేసినట్లు అతడిని అనుమానించి గ్రామంలోని కొంత‌మంది తీవ్రంగా కొట్టారు. అనంత‌రం అత‌ని జుట్టు క‌త్తిరించి అవ‌మానించారు.

అంతేకాకుండా అక్కడ ఆ దృశ్యాల‌ను ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత రోజు అతడు తన సొంతూరుకు వెళ్లాడు. ఈ అవమాన భారం భరించలేని అతడు బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.