General News

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

Online Game: తాజాగా చెన్నైలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నెలకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు సంపాదించే ఒక బ్యాంకు ఉద్యోగి భార్య పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మణికందన్ అనే వ్యక్తి పారూర్ లోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉండటంతో మణికందన్ కూడా మంచి జీతమే వస్తూ ఉండేది.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

అతను సంవత్సరానికి దాదాపు 28 లక్షల జీతం తీసుకునే వాడు. ఇక సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ లోని సెవెంత్ ఫ్లోర్ లో తన భార్య తారా, కొడుకు తరుణ్, మరొక కొడుకు దహన్ తో కలిసి నివసిస్తూ ఉండేవాడు.
ఈ మధ్యకాలంలో మణికందన్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆటకి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే లక్షల జీవితం వస్తున్నా కూడా, ఆ ఆట కోసం లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు. చివరికి అప్పుల పాలయ్యాడు.

Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!

ఈ క్రమంలోనే ఒక రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్న మణికందన్ కు, అతని భార్య తారా కి మధ్య కి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు భార్యతో గొడవలు, మరొకవైపు అప్పులు తీసుకున్న వాళ్లు నుంచి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మణికందన్, క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

అప్పుల బాధలు తట్టుకోలేక..

ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 31న ఎప్పటిలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మణికందన్ కు అప్పు ఇచ్చిన అతని స్నేహితురాలు తరచూ ఫోన్ చేస్తుండటంతో.. ఏదో ఒక కారణం చెప్పాలి అని మణికందన్ తన భార్యతో ఫోన్ మాట్లాడించేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా మణికందన్ మొదట తన భార్యా పిల్లలను చంపి అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక జనవరి 1న వీరు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నట్టింట్లో తారా, ఆమె పిల్లలు విగతజీవులుగా కనిపించారు. మణికందన్ కిచెన్ లో ఉరి వేసుకొని కనిపించాడు. మణికందన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశాడు అని పోలీసుల విచారణలో తేలింది. మొదట భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపి, తన పిల్లలను గొంతునులిమి హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago