Categories: FeaturedMovie News

Hero Suman: ఇండస్ట్రీకి పెద్దరికం అవసరం లేదు.. అదంతా అబద్ధం.. సుమన్ సంచలన వ్యాఖలు !

Hero Suman: మొన్న మెగస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సినీ పెద్దగా తాను ఉండను అని.. అండగా ఉంటానని అని చెప్పిన చిరంజీవి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశం మా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ప్రస్తావన వచ్చింది.

Hero Suman: సినీ పెద్దరికంపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..అదంతా అబద్ధం అంటూ..!

ఎన్నికల తర్వాత ఎవరూ మాట్లాడలేదు. చిరంజీవి మరోసారి ఇలా మాట్లాడటంతో దీనిపై సినీ పెద్దలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మోహన్ బాబు సినీ పరిశ్రమ కష్టాలను తీర్చండి అంటూ ఓ పెద్ద లేఖను జగన్ సర్కారుకు రాసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు, జీవితాలంటూ లేఖలో పేర్కొ‍న్నాడు.

Hero Suman: సినీ పెద్దరికంపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..అదంతా అబద్ధం అంటూ..!

దాంతోనే మళ్లీ సినీ పెద్ద ఎవరనే దానిపై చర్చ కొనసాగింది. తాజాగా సీనియర్‌ నటుడు, హీరో సుమన్‌ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు తిరుపతిలో జరిగిన విలేకురుల సమావేశంలో మాట్లాడారు. తాను సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు 44 ఏళ్లు పూర్తయిందని.. 600 సినిమాలను తాను 10 భాషల్లో నటించానన్నాడు. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగానన్నాడు.


ఆ విషయంలో వాస్తవం లేదు…సుమన్ వ్యాఖ్యలు వైరల్..

ఇంత కాలం నుంచి చూస్తున్న సినిమా రంగంలో ఐక్యత లేదనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నాడు. కృష్ణంరాజు, మురళీమోహన్, కృష్ణ లాంటి సీనియర్లు సినీ పరిశ్రమలో ఉన్నారన్నారు. ఏదైనా సమస్య ఉంటే.. వారి సలహా తీసుకోవాలన్నారు. ఈ సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం కరెక్ట్ కాదని.. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago