Anchor Anasuya: అనసూయ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఇటు బుల్లి తెరపై అటు వెండితెరపై వెలిగిపోతుంది ఈ భామ. జబర్థస్త్ తో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా టీవీలో షోలతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ… ప్రస్తుతం వెండితెరపై కూడా మెరుస్తోంది.
టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా రాణిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ లో నటించిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా మెరుస్తోంది. ఇప్పటికే తన అందచందాలతో, ఐటెం సాంగ్స్ లతో ఫ్యాన్స్ ను అలరించింది.
తాజాగా ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించింది. ద్రాక్షాయణి క్యారెక్టర్ లో సునీల్ కు భార్యగా నటించింది. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ తో అలరించింది. ఇదే కాకుండా రానున్న రోజుల్లో పలు క్రేజీ కాంబినేషన్లలో సినిమాల్లో నటిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మేకప్ లేకుండా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్లు బాగానే స్పందిస్తున్నారు. మేకప్ లేకుండానే చాలా అందంగా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. అనసూయ పెద్ద స్కామ్ చేసిందని… ఇన్నాళ్లు మేకప్ లో తన అందాన్ని దాచేసిందని కామెంట్లు పెడుతున్నారు. 38 సంవత్సరాల్లో కూడా అనసూయ అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్లపై అనసూయ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…