Siri-Srihan: ఏవండోయ్.. ఇది విన్నారా..సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నారట?
Siri-Srihan: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. ఇంకా వార్తల్లోనే ఉంటోంది. ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్, సిరి, దీప్తిల చుట్టే వార్తలు తిరుగుతున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ లో విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ గురించి కూడా ఇంత చర్చ జరగడం లేదు.
గతంలో సిరి కారణంగా షన్నూ కప్ కోల్పోయాడని నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ఇదిలా ఉంటే.. దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ లు విడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సిరి వల్లే షన్నూ మారిపోయాడని… ఐదేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్న దీప్తి- షన్నూలు విడిపోయారని నెటిజెన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూల మధ్య రొమాన్స్ హద్దులు దాటిపోయింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అందరిలోనూ అనుమానం కలిగించింది. కిస్సింగులు, హగ్గింగులతో హద్దులు దాటిపోయారు. ఒకానొక సందర్భంలో సిరి తల్లి కూడా ఈ వ్యవహారంపై ఫైర్ అయింది. ఇవన్నీ పరిణామాల మధ్య దీప్తి సునయన షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. తన ఇన్ స్టా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే తాజాగా సిరి- శ్రీహాన్ జంట కూడా త్వరలో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తర్వాత సిరి, శ్రీహాన్ ఇప్పటి వరకు కలుసుకోలేదు. అయితే ఇటీవల జనవరి 3న సిరికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు శ్రీహాన్. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లెస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. అయితే బిగ్ బాస్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సిరి ఇప్పటికీ శ్రీహాన్ ను కలుసుకోలేదని తెలుస్తోంది. షన్నూతో సిరి దగ్గరవ్వడంతో శ్రీహాన్ దూరంగా ఉంటున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. త్వరలో వీరిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…