Categories: FeaturedMovie News

Dil Raju: నా స్థానంలో ఇంకొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు… దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే తాజాగా ఈయన నిర్మాణంలో కోలీవుడ్ హీరో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన వరిసు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ సినిమా వల్ల భారీగా నష్టపోయానని ఈయన తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా 2015 వ సంవత్సరంలో అజ్ఞాతవాసి సినిమా నైజాం హక్కులను తాను కొనుగోలు చేశానని తెలిపారు.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తనకు ఫైనాన్షియల్ గా భారీ డ్యామేజ్ జరిగిందని దిల్ రాజు తెలిపారు.ఇక అదే ఏడాదిలోనే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా హక్కులను కూడా తాను కొనుగోలు చేశానని అయితే ఈ సినిమా కూడా తనకు తీవ్రమైన నష్టాలను మిగిల్చిందని దిల్ రాజు తెలిపారు. ఈ రెండు సినిమాల కారణంగా తాను భారీగా నష్టపోయానని తెలియజేశారు.

Dil Raju: ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు…


ఈ విధంగా ఫైనాన్షియల్ గా ఈ రెండు సినిమాలు బాగా దెబ్బ కొట్టడంతో నష్టాలు వచ్చాయి.ఇక నా స్థానంలో ఇతర నిర్మాతలు ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయే వారని ఈయన తెలిపారు. ఇక అదే ఏడాది తాను ఆరు హిట్ సినిమాలను అందుకోవడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగానని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago