Adivi Sesh: అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నాగార్జున మినహా తర్వాతి తరం వాళ్లు ఎవరూ కూడా ఇండస్ట్రీలో పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయారని చెప్పాలి.ఇకపోతే అక్కినేని కాంపౌండ్ నుంచి నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఈ సినిమా తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇకపోతే సుప్రియ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో అడివి శేష్ తో కలిసి గూడాచారి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శేష్ ఎప్పటికప్పుడు ఖండించారు.
ఇకపోతే ఈ విషయం గురించి అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా శేష్ అక్కినేని ఫ్యామిలీతో కలిసి పెద్ద ఎత్తున ఈ వేడుకలను జరుపుకున్నారు. అంతేకాకుండా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో శేష్ సుప్రియ పక్కపక్కనే ఫోటోలు దిగడంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే వీరి రిలేషన్ గురించి పలువురు చర్చలు జరుపుతూ…వీరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందని అయితే ఆ రిలేషన్ బహిరంగంగా బయట పెట్టడానికి ఏదో ఇబ్బంది ఎదురవుతుందని పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. వీరి బంధం బహిర్గతం అవ్వడానికి అడ్డుపడుతున్న ఆ శక్తులు ఏంటి అనేది అందరిలోనూ సందేహం మొదలైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…