Karate Kalyani: తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో క్యారెక్టర్స్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఈమె ఎక్కువగా సినిమాలలో నటించిన పాత్రలన్నీ కూడా వ్యాంప్ పాత్రలు కావడం గమనార్హం. అయితే ఈమె అద్భుతమైన కామెడీని కూడా పండించగలదు.
ఇక కరాటే కళ్యాణి తన సినీ కెరియర్ లో సుమారు 25 సినిమాలలో నటించారు.ఇక కృష్ణ సినిమాలో బాబి అనే డైలాగు ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. అదేవిధంగా మిరపకాయ్ సినిమాలో అబ్బా అనే డైలాగుతో పాపులర్ అయ్యారు.అయితే ఈమె సినిమాల ద్వారా ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అలాగే వివాదాల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయం గురించి అయినా కళ్యాణి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. తాను బతుకుతెరువు కోసం సినిమాలలోకి వచ్చాను. అందుకే ఇక్కడ తనకు అవకాశం వచ్చిన ప్రతి పాత్రలోనూ నటించాలని అయితే తనకు కొన్ని పాత్రలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయనీ తెలిపారు. అయితే తాను అలాంటి పాత్రలలో నటించడం వల్ల తనని వ్యభిచారిగానే భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాల పరంగా మాత్రమే తాను అలాంటి పాత్రలలో నటించానని వ్యక్తిగతంగా తాను చాలా మంచి దానిని ఎంతోమందికి సహాయం చేశానని ఈమె తెలిపారు. ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చి బ్రతుకుతెరువు కోసం కోసం.. డబ్బింగ్ చెప్పడం.. జింగిల్స్ పాడటం చేశాను. అయితే నేను చేసిన పాత్ర వల్ల కొందరు నన్ను వ్యభిచారి అంటూ మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలు తనని చాలా బాధిస్తున్నాయని ఈ సందర్భంగా కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…