Tag Archives: Coronavirus Vaccine

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై పంజా విసురుతున్న కరోనా.. జాగ్రత్తంటున్న నిపుణులు..?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అందరి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ జీవనశైలి వ్యాధిగ్రస్తులు అయినటువంటి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండ వంటి తదితర సమస్యలతో బాధపడే వారిలో అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత వారిలో అధికంగా ఉంటుంది.తద్వారా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, మధుమేహంతో బాధపడేవారిలో మూడింతలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారిలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధులతో బాధపడేవారికి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరించారు.

ఈ విధమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరిలో ఎలాంటి యాంటీబాడీలు వృద్ధి చెందడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ ఏ వస్తువును తాకిన శానిటైజర్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని తగినన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే ఈ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

కరోనా చికిత్సకు సరికొత్త ఔషధం..?

ప్రపంచవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ఇప్పటికే పలు రకాల కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కి వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం మరొక కొత్త మందు త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ‘మోల్నుఫిరావిర్‌–400ఎంజీ ’మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది. మనదేశంలో మొట్టమొదటిసారిగా యశోద ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలియజేశారు.

ఈ ఔషధంతో ఇప్పటి వరకు జరిపిన రెండు దశల ట్రయల్స్ లో భాగంగా ఈ మందు జంతువులు, మనుషులపై ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని, ఔషధం వల్ల ఏ ఒక్కరిలో కూడా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపారు. ఈ మందును కరోనా బాధితులలో ఉపయోగించడం వల్ల కరోనా నుంచి తొందరగా కోలుకున్నట్లు తెలియజేశారు.

మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 34 ఆస్పత్రుల్లో 1,218 మందిని ఈ ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, యశోద ఆస్పత్రిలో 50 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం ఐదు రోజుల పాటు ఈ మందులను వాడి ఆ తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా, నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా మరి రెండు నెలలలో ఇవి పూర్తికాగానే నాలుగవ దశ ట్రయల్స్ కూడా జరుగుతాయని. యశోద ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ తెలిపారు.

ఆ మందు కరోనా చికిత్సకు వాడొద్దు.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా చికిత్సకు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు కొరత అధికంగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా చికిత్సలో ఎంతో కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పై అనుమానాలు ఉన్నాయని, ఇంజెక్షన్లను ఉపయోగించటం వల్ల కరోనా బాధితులు కరోనా నుంచి కోరుకున్నట్లు తమకు ఎటువంటి ఆధారాలు లేవని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటువంటి సందేహాలు తలెత్తడం వల్లే ఈ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ కరోనా చికిత్స నుంచి తొలగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

ఈ క్రమంలోనే భారత్ లో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంజక్షన్ పై అనుమానాలు తలెత్తడంతో ఇంజెక్షన్లను కరోనా బాధితులకు ఉపయోగించకూడదని భారత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్ని రోజులు కరోనా చికిత్సలో భాగంగా ఎంతో డిమాండ్ ఏర్పడిన రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను కొందరు ప్రభుత్వ సిబ్బంది చేతివాటం చూపిస్తూ బయట బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ వేలల్లో అమ్ముతూ డబ్బును పోగు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇటువంటి సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంజెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దేశ ప్రజలకు శుభవార్త.. ఆ కరోనా వ్యాక్సిన్ తో 100 శాతం ఫలితాలు..?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ కు త్వరగా చెక్ పెట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఆస్ట్రాజెనెకా అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్‌ సోరియట్ తమ కరోనా వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలు ఇస్తోందని వెల్లడించారు.

బ్రిటన్ కు చెందిన ఒక కంపెనీ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారని ఆయన అన్నారు. గతంలో ఏ వ్యాక్సిన్ 100కు 100 శాతం ఫలితాలను ఇవ్వలేదు. అయితే ఆస్ట్రాజెనెకా మాత్రం 100కు 100 శాతం ఫలితాలు ఇవ్వడంతో కరోనా వైరస్ కు త్వరలోనే చెక్ పెట్టవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే బ్రిటన్ లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.

అతి త్వరలో ఈ వ్యాక్సిన్ కు బ్రిటన్ లో పంపిణీ చేసేందుకు అనుమతులు వస్తాయని తెలుస్తోంది. పుణెకు చెందిన సీరం సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలిసి పని చేస్తోంది. మరోవైపు మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ త్వరలో మొదలు కానుంది. దేశంలో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాయి.

మరోవైపు కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా ఆ సైడ్ ఎఫెక్ట్ లు తాత్కాలికమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020 సంవత్సరంలో కరోనా వల్ల ఇబ్బందులు పడిన ప్రజలు 2021లోనైనా పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు.