కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ కు త్వరగా చెక్ పెట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఆస్ట్రాజెనెకా అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ సోరియట్ తమ కరోనా వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలు ఇస్తోందని వెల్లడించారు.
బ్రిటన్ కు చెందిన ఒక కంపెనీ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారని ఆయన అన్నారు. గతంలో ఏ వ్యాక్సిన్ 100కు 100 శాతం ఫలితాలను ఇవ్వలేదు. అయితే ఆస్ట్రాజెనెకా మాత్రం 100కు 100 శాతం ఫలితాలు ఇవ్వడంతో కరోనా వైరస్ కు త్వరలోనే చెక్ పెట్టవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే బ్రిటన్ లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.
అతి త్వరలో ఈ వ్యాక్సిన్ కు బ్రిటన్ లో పంపిణీ చేసేందుకు అనుమతులు వస్తాయని తెలుస్తోంది. పుణెకు చెందిన సీరం సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలిసి పని చేస్తోంది. మరోవైపు మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ త్వరలో మొదలు కానుంది. దేశంలో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాయి.
మరోవైపు కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా ఆ సైడ్ ఎఫెక్ట్ లు తాత్కాలికమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020 సంవత్సరంలో కరోనా వల్ల ఇబ్బందులు పడిన ప్రజలు 2021లోనైనా పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…