తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియంత్రిత సాగు విధానంపై వెనుకడుగు వేశారు. నియంత్రిత సాగు వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో రైతుబంధు స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుబంధు సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ నియంత్రిత సాగుపై వెనుకడుగు వేశారు.
నియంత్రిత సాగు వల్ల టీఆర్ఎస్ సర్కార్ కు దాదాపు 7500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సమాచారం. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇకపై నియంత్రిత సాగు విధానం ఉండదని.. రైతులు తమకు ఇష్టమైన పంటలను వేసుకోవచ్చని కేసీఆర్ సూచనలు చేశారు. పొలంలో ఏ పంట వేసుకోవాలనే నిర్ణయాన్ని రైతుల వ్యక్తిగత ఇష్టాలకే వదిలేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు ప్రగతి భవన్ లో సమీక్షలో భాగంగా కేసీఆర్ నియంత్రిత సాగుకు సంబంధించిన్ ప్రకటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంటల సాగుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కొత్త వ్యవసాయ చట్టాలను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు తమ పంటకు ఎక్కడ ఎక్కువ రేటు లభిస్తే అక్కడే విక్రయించవచ్చు. కేంద్రం ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలు రద్దైన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు గురించి ప్రకటించిన సమయంలోనే కేసీఆర్ నిర్ణయంపై రైతులు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు రేపటి నుంచి రాష్ట్రంలో రైతులకు రైతుబంధు సహాయం అందనుంది. 7,515 కోట్ల రూపాయలను ప్రభుత్వం 61.49 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…