Featured

మందుబాబులకు షాక్.. తాగి నడిపితే 6 నెలల జైలు శిక్ష, ఉద్యోగాలు పోయే ఛాన్స్..!

దేశంలో జరిగే వాహన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు మందుబాబుల వల్లే జరుగుతున్నాయి. మద్యం మత్తు వల్ల కొందరు తమ ప్రాణాలను కోల్పోతుంటే మరి కొందరు అవతలి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. కొత్తకొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే రాచకండ పోలీసులు మందుబాబులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై మందుబాబులు మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు మందుబాబులు పని చేసే ఆఫీస్ కు సమాచారం ఇవ్వనున్నారు. 10 వేల రూపాయల ఫైన్ తో పాటు 90 రోజుల పాటు లైసెన్స్ రద్దవుతుంది. తొలిసారి పట్టుబడితే ఈ శిక్షలన్నీ అమలవుతాయి. రెండోసారి మద్యం తాగి పట్టుబడితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు కావడంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 15 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మళ్లీ ప్రారంభం కావడంతో పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాపిక్ అధికారులు మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాలు తప్పవని చెబుతున్నారు. హై కమాండ్ ఆర్డర్ల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించామని.. మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నామని వెల్లడించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుందని వాహన్దారులు ట్రాపిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ట్రాపిక్ పోలీసులు కరోనా వల్ల గత కొన్ని నెలల నుంచి బ్రీత్ ఎనలైజర్లను ఉపయోగించలేదు. అయితే కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో మళ్లీ వాటితోనే పరీక్షలు జరుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago