ప్రపంచవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ఇప్పటికే పలు రకాల కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కి వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం మరొక కొత్త మందు త్వరలోనే మార్కెట్లోకి రానుంది.
ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ‘మోల్నుఫిరావిర్–400ఎంజీ ’మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది. మనదేశంలో మొట్టమొదటిసారిగా యశోద ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలియజేశారు.
ఈ ఔషధంతో ఇప్పటి వరకు జరిపిన రెండు దశల ట్రయల్స్ లో భాగంగా ఈ మందు జంతువులు, మనుషులపై ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని, ఔషధం వల్ల ఏ ఒక్కరిలో కూడా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపారు. ఈ మందును కరోనా బాధితులలో ఉపయోగించడం వల్ల కరోనా నుంచి తొందరగా కోలుకున్నట్లు తెలియజేశారు.
మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 34 ఆస్పత్రుల్లో 1,218 మందిని ఈ ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, యశోద ఆస్పత్రిలో 50 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం ఐదు రోజుల పాటు ఈ మందులను వాడి ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా, నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా మరి రెండు నెలలలో ఇవి పూర్తికాగానే నాలుగవ దశ ట్రయల్స్ కూడా జరుగుతాయని. యశోద ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…