Tag Archives: cyber crime

Cyber Crime: మెడికల్ కంపెనీకి భారీ టోకరా వేసిన సైబర్ నేరగాళ్ళు… ఒక్క మెయిల్ తో !

Cyber Crime: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.

cyber crime happened in hyderabad and looted money with fake mail

తాజాగా హైదరాబాద్‌కు చెందిన మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీ యాజమాన్యానికి భారీ టోకరా వేశారు. ఒక్క మెయిల్‌తో ఏకంగా రూ. 46 లక్షలు కాజేశారు. అది నిజమైన మెయిల్ కాదని, సైబర్ నేరగాళ్ల మాయ అని గుర్తించిన కంపెనీ యాజమాన్యం… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలు ప్రకారం… నగరంలోని సంతోష్‌ నగర్‌లో గల ‘సెన్స్‌కోర్‌ మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ మెడికల్‌ ఏజెన్సీ, కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది.

cyber crime happened in hyderabad and looted money with fake mail

ఇందులో భాగంగా ఏడాదిలో మూడు సార్లు ‘ఏజీ సైంటిఫిక్‌’ నుంచి మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏజెన్సీ కొనుగోలు చేస్తుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్‌’వారిని సంప్రదించారు ఇక్కడి ఏజెన్సీ వారు. అయితే, ఏజీ సైంటిఫిక్‌ వాళ్లు తమ బ్యాంక్‌ ఖాతాను ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారట. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు… పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్‌ తీసేసి ఫేక్‌ మెయిల్‌ సృష్టించారు.

మెయిల్ హ్యాక్ చేసి ఎన్ని లక్షలు కాజేశారంటే ?

ఆ ఫేక్‌ మెయిల్‌తో రూ.46 లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్‌ అకౌంట్‌ను కూడా పంపారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వారు బ్యాంక్‌ అకౌంట్లను మారుస్తుంటారని, ఈ సారి కూడా అలాగే మార్చి ఉంటారని భావించి వాళ్లు అడిగిన రూ.46 లక్షలను కేటుగాళ్ల పంపిన అకౌంట్లకు పంపారు. అయితే, ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకోగా… తాజాగా మీ డబ్బులు రాలేదంటూ ఏజీ సైంటిఫిక్ వాళ్లు మెయిల్ పెట్టడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్క క్లిక్ చేశాడు రూ. 4.90 లక్షలు.. పోగొట్టుకున్నాడు.. ఎలాగంటే?

బ్యాంక్ ఖాతాకు.. పాన్ కార్డును లింక్ చేయాలని.. ఆధార్, పాన్ కార్డును కూడా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయితే అలా చేస్తున్న క్రమంలో అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి మాత్రమే చేసుకోవాలని కూడా సూచించింది. అయితే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో తమ ఫోన్లకు వచ్చే లింక్ లను ఓపెన్ చేయవద్దని పోలీసులు అవగాహన కార్యక్రమలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది సైబర్ వలలో పడుతున్నారు.

చదువు లేని వాళ్లు అంటే.. తెలిసి.. తెలియక ఇలా చేశారు అనుకుంటే.. చదువుకున్న మూర్ఖులు కూడా ఇలానే చేస్తున్నారు. తర్వాత లబోదిబో మంటూ మొత్తుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం రోజూ చూస్తునే ఉన్నాం. అలాంటిదే మరొకటి నిజామాబాద్ లో చోటుచేసుకుంది.

బ్యాంక్‌ ఖాతాకు పాన్‌కార్డు లింక్‌ చేయమని వచ్చిన మెసేజ్‌ ను క్లిక్ ఇచ్చి.. తన అకౌంట్లో ఉన్న దాదాపు రూ. 4.90 లక్షలను పోగొట్టుకున్నాడు ఓ బాధితుడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ లోని కంఠేశ్వర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్‌ అకౌంట్‌కు పాన్‌కార్డు లింక్‌ చేయాలని సెప్టెంబర్‌ 30వ తేదీ మెసేజ్‌ వచ్చింది. అలాగే అతడు లింక్ ను ఓపెన్ చేసి అన్ని వివరాలను ఇచ్చాడు.

తర్వాత వెంటనే మరో వ్యక్తి ఫోన్ చేసి ఎస్ బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆ నంబర్‌ చెప్పిన కాసేపటికే తన బ్యాంక్‌ ఖాతాలోని రూ.4.90 లక్షల విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్‌ వచ్చింది. వెంటనే సదరు వ్యక్తి వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఓటీపీని అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని సూచించారు.

గూగుల్ సెర్చ్ చేసాడు…రూ.6.5 లక్షలు పోగొట్టుకున్నాడు.. ఎలాగంటే?

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంతో మంది అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షలకు లక్షలు డబ్బును దోచుకుంటున్నారు.ఇప్పటివరకు ఈ విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎందరినో చూసాము. చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతూ లక్షలకు లక్షలు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.6.5 లక్షలు దోచుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని లోతుకుంటకు చెందిన పశుపతి అనే వ్యక్తి ఆన్ లైన్ ద్వారా ఆయుర్వేద ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్రొడక్ట్స్ అతనికి డెలివరీ అయ్యాయి. అయితే ఆ ఉత్పత్తులు తనకు నచ్చకపోవడంతో తిరిగి వాటిని రిటన్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు.

ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తికి ఫోన్ వచ్చింది. అవతలి నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ… మీ డబ్బులు వాపసు ఇస్తానని చెప్పాడు. అందుకోసం ఒక లింక్ మీ మొబైల్ కి పంపిస్తాను దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పిన విధంగానే పశుపతి ఎనీ డెస్క్ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నాడు.ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మరోసారి ఆ వ్యక్తి ఫోన్ చేసి పశుపతి క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లు తీసుకొని త్వరలోనే మీ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పారు.

ఈ విధంగా అవతలి వ్యక్తి ఫోన్ మాట్లాడి పెట్టేసిన కొన్ని నిమిషాలకే పశుపతి 2 ఖాతాల నుంచి ఏకంగా రూ.6.5లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో వెంటనే అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు.అప్పటికే అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన పశుపతి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.

గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రై చేస్తున్నారా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు..!

ఒకప్పుడు దొంగలు దొంగతనాలు చేయాలంటే ఇళ్లలోకి చొరబడి డబ్బును దొంగలించేవాళ్లు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు మోసగాళ్లు ఆన్ లైన్ లోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో తెలివితేటలు ఉన్నవాళ్లను సైతం మోసగాళ్లు మోసం చేస్తున్నారు. చాలామంది ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నా మోసపోయామని ఇతరులకు చెప్పడానికి, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టెన్షన్ పడుతున్నారు.

తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లను టార్గెట్ చేసుకొని సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఉజ్వల గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అందిస్తున్నట్టు సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ న్యూస్ నిజమని నమ్మి తమకు తెలిసిన వాళ్లకు న్యూస్ ను పంపుతున్నారు.

మరి కొందరు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తపై ఆరా తీసి ఈ వార్తలో నిజానిజాలను వెల్లడించింది. పీఐబీ పరిశోధనలో ఈ వెబ్ సైట్ ఫేక్ అని తేలింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఆన్ లైన్ లో వచ్చే ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. దొంగ వెబ్ సైట్లను నమ్మి అస్సలు మోసపోవద్దని సూచిస్తోంది.

ఈ మధ్య్ కాలంలో మోసగాళ్లు ఏదో ఒకటి ఆశ చూపి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మోసాల గురించి పూర్తి అవగాహన ఉంటే మాత్రమే మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మోసపోయి బాధపడక తప్పదు.