Tag Archives: debit card

డెబిట్ కార్డులు వాడుతున్నారా.. మోసపోకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు డెబిట్ కార్డులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సైబర్ మోసగాళ్లు ఈ మధ్య కాలంలో డెబిట్ కార్డుల ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ డెబిట్ కార్డులకు సంబంధించి కీలక సూచనలు చేసింది.

పీఓఏస్ మిషన్ లేదా ఏటీఎంలలో లావాదేవీలు జరిపే సమయంలో కీప్యాడ్ ను చేతితో మూసివేయాలని ఎస్బీఐ సూచించింది. ఏటీఎం డెబిట్ కార్డ్, పిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పవద్దని కోరింది. ఏటీఎం కార్డుపై ఏటీఎం పిన్ కు సంబంధించిన వివరాలను రాయవద్దని తెలిపింది. ఏటీఎంలలో వెనుక నిల్చొన్న వ్యక్తి ఏటీఎం పిన్ ను చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏటీఎంలో లావాదేవీలను ప్రారంభించడానికి ముందు సీసీ కెమెరాలను పరిశీలించాలని తెలిపింది.

పుట్టిన రోజు, ఫోన్ నంబర్, వరుస నంబర్లను ఏటీఎం పిన్ గా పెట్టుకోకూడదని పేర్కొంది. ఈ జాగ్రత్తలతో పాటు కస్టమర్లు లావాదేవీ రశీదులను ఏటీఎం కేంద్రంలోనే పారవేయకుండా ఉంటే మంచిది. కార్డు వివరాలు, పిన్ నంబర్ అడుగుతున్న ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. మరోవైపు ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు లావాదేవీలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి నెల 1వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

ఓటీపీ ఆధారిత లావాదేవీల వల్ల ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజర్లు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎస్బీఐ ఖాతాదారులను మోసాల నుంచి రక్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని వెల్లడించింది.

ఆ బ్యాంక్ లో మహిళల కోసం స్పెషల్ అకౌంట్.. ఎన్నో లాభాలు..?

దేశంలోని బ్యాంకులు రోజురోజుకు కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని బ్యాంకులు అయితే ఏకంగా మహిళల కోసం స్పెషల్ అకౌంట్లు ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ మహిళలకు మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవా పేరుతో మహిళలకు స్పెషల్ అకౌంట్ సర్వీసులను అందిస్తోంది.

మహిళలు ఈ స్పెషల్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా సాధారణంగా బ్యాంకుల నుంచి పొందే ప్రయోజనాలతో పోల్చి చూస్తే ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేటుతో పోల్చి చూస్తే ఈ అకౌంట్ ను ఒపెన్ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఇవా అకౌంట్లు ఓపెన్ చేసిన మహిళలకు ఏకంగా 7 శాతం వడ్డీని అందిస్తోంది.

మహిళలు ఎవరైతే ఇవా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేస్తారో వాళ్లకు ఉచితంగా హెల్త్ చెకప్, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం మహిళా డాక్టర్లతో మాట్లాడే అవకాశం సైతం ఉంటుంది. మహిళలు ఈ అకౌంట్ ను ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ చార్జీలను సైతం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న మహిళలు గోల్డ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

మహిళలు ఎవరైనా సమీపంలోని ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు వెళ్లి సులభంగా ఈ బ్యాంక్ అకౌంట్ ను తెరవవచ్చు. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డెబిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేస్తే రివార్డ్ పాయింట్లను పొందే అవాకాశం ఉండటంతో పాటు ఈ బ్యాంక్ ఖాతా ఉన్న మహిళలకు లాకర్లపై 25 నుంచి 50 శాతం చార్జీల తగ్గింపు ఉంటుంది.

ఫ్రీగా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే..?

రోజులు మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యవసర సమయల్లో ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉంటాం. ప్రతి నెలా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్నింటి ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లో భాగంగా ఈ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. వీటితో పాటు బ్యాంకు ఖాతాలు ఉన్నవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాగా కలిగి ఉండి క్రెడిట్ లేడా డెబిట్ కార్డ్ ఉండే ఇన్సూరెన్స్ ను పొందవచ్చు.

క్రెడిట్ కార్డు కంపెనీలు రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించే కస్టమర్లకు 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. అయితే బ్యాంకును బ్యాంకును బట్టి నియమనిబంధనల్లో మార్పులు ఉంటాయి. బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే వినియోగించే డెబిట్ కార్డును బట్టి ఇన్సూరెన్స్ లో మార్పులు ఉంటాయని సమాచారం.

అయితే ఈ ఇన్సూరెన్స్ ల గురించి తెలుసుకోవాలంటే బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే రీఛార్జ్ చేసుకున్న సమయంలో మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈపీఎఫ్‌వో సైతం ఖాతాదారులకు ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుండగా ఈ ఇన్సూరెన్స్ లపై అవగాహన ఉంటే వీటి ద్వారా ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

ఒక్క రూపాయికే బంగారం.. ఇంటికి డెలివరీ పొందే అవకాశం..!

20 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతోంది. రోజురోజుకు బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనే కంటే అమ్మడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మిగతా వాటితో పోలిస్తే బంగారం ధర శరవేగంగా పెరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో బంగారం ధర రెండు రెట్లు పెరిగిందని చెబుతున్నారు.

అయితే తక్కువ మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది. ఒక్క రూపాయి నుంచి ఎంత మొత్తానికైనా డిజిటల్ గోల్డ్ ను సులభంగా కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది. మర్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన భారత్ పే సేఫ్ గోల్డ్ తో ఒప్పందం కుదుర్చుకుని తన మర్చంట్లకు డిజిటల్ గోల్డ్ కొనే సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది.

భారత్ పే మర్చంట్లు 24 క్యారెట్ల బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో భారత్ పే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ సర్వీసెస్ ద్వారా దీపావళి పండుగ నాటికి 6 కేజీల బంగారాన్ని అమ్మాలని భారత్ పే టార్గెట్ గా పెట్టుకుంది. చాలామంది మర్చంట్ల కోరిక మేరకు డిజిటల్ గోల్డ్ సర్వీస్ లను ప్రారంభించామని తెలిపింది,

బంగారం కొనుగోలు చేసిన వాళ్లకు జీఎస్‌టీ ఇన్‌పుట్‌ను క్రెడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా భారత్ పే కల్పిస్తోంది. అవసరం అనుకున్న వాళ్లు డిజిటల్ గోల్డ్ మొత్తంతో ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేసే అవకాశం భారత్ పే కల్పిస్తోంది. భారత్ పే ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ ఈ విషయాలను వెల్లడించారు.

ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే!

ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.

అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.

అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.

ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.

రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.

అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.