20 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతోంది. రోజురోజుకు బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనే కంటే అమ్మడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మిగతా వాటితో పోలిస్తే బంగారం ధర శరవేగంగా పెరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో బంగారం ధర రెండు రెట్లు పెరిగిందని చెబుతున్నారు.
అయితే తక్కువ మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది. ఒక్క రూపాయి నుంచి ఎంత మొత్తానికైనా డిజిటల్ గోల్డ్ ను సులభంగా కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది. మర్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన భారత్ పే సేఫ్ గోల్డ్ తో ఒప్పందం కుదుర్చుకుని తన మర్చంట్లకు డిజిటల్ గోల్డ్ కొనే సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది.
భారత్ పే మర్చంట్లు 24 క్యారెట్ల బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో భారత్ పే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ సర్వీసెస్ ద్వారా దీపావళి పండుగ నాటికి 6 కేజీల బంగారాన్ని అమ్మాలని భారత్ పే టార్గెట్ గా పెట్టుకుంది. చాలామంది మర్చంట్ల కోరిక మేరకు డిజిటల్ గోల్డ్ సర్వీస్ లను ప్రారంభించామని తెలిపింది,
బంగారం కొనుగోలు చేసిన వాళ్లకు జీఎస్‌టీ ఇన్‌పుట్‌ను క్రెడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా భారత్ పే కల్పిస్తోంది. అవసరం అనుకున్న వాళ్లు డిజిటల్ గోల్డ్ మొత్తంతో ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేసే అవకాశం భారత్ పే కల్పిస్తోంది. భారత్ పే ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…