ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇంటర్ కు ఆన్ లైన్ లో అడ్మిషన్లు చేయాలంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. విద్యాశాఖ ఆన్ లైన్ లో అడ్మిషన్లను చేపట్టడానికి గల కారణాలను వెల్లడించాలని.. ఏ నిబంధనలను అనుసరించి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందో చెప్పాలని హైకోర్టు కోరింది.
ఆన్ లైన్ అడ్మిషన్ల గురించి దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు విద్యార్థులకు ఛాయిస్ లేకుండా కాలేజీలలో ప్రభుత్వమే సీట్లను కేటాయించడాన్ని తప్పుబట్టింది. ఏ కాలేజీలో విద్యార్థులు చేరాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్ పై ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రభావం పడిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను వినిపించారు.
ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ తరపు లాయర్ ఆన్ లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థి సరైన గ్రూపును ఎంచుకోలేడని.. అడ్మిషన్ల సమయంలో కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థికి ఏ గ్రూప్ ఇష్టమో తెలుసుకోవచ్చని.. ఆన్ లైన్ అడ్మిషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మరింత సమయం కావాలని హైకోర్టు లాయర్ వాదించారు.
హైకోర్టు ఆన్ లైన్ అడ్మిషన్లపై స్టే విధించగా కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 10వ తేదీలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…