Tag Archives: Discount

కార్లు కొనేవాళ్లకు బంపర్ ఆఫర్.. ఏకంగా రెండున్నర లక్షలు తగ్గింపు..?

2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల కార్ల విక్రయాలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలను భారీగా పెంచేశాయి. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కారు కొనుగోలు కోసం గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన హోండా కార్స్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

హోండా కార్ మోడళ్లపై కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కార్లను కొనుగోలు చేసే వాళ్లు సివిక్ డీజిల్ కారు కొనుగోలుపై ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. హోండా డీలర్ షిప్స్ ద్వారా తగ్గింపు ధరకే కొత్తకారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం ఉంటుందని సమాచారం. సివిల్ డీజిల్ కారుతో పాటు సివిక్ పెట్రోల్ కారుపై కూడా హోండా ఆఫర్లను అందిస్తోంది.

సివిక్ పెట్రోల్ కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. హొండా కంపెనీ పలు కార్లపై డిస్కౌంట్లను ప్రకటించగా కొన్ని కార్లపై మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఇస్తూఉండటం గమనార్హం. హోండా అమేజ్ కారు కొనుగోలుపై 15,000 రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా 10,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ రూపంలో డిస్కౌంట్ లభిస్తోంది.

కొత్త కార్ల కొనుగోలుపై హోండా సాధారణంగా ఉండే వారంటీ కంటే అదనంగా వారంటీ బెనిఫిట్ ను అందిస్తూ ఉండటం గమనార్హం. హోండా జాజ్ పెట్రోల్ వేరియంట్ మోడల్ కారుపై 15,000 రూపాయల డిస్కౌంట్ ఉండగా హోండా డబ్ల్యూఆర్‌వీ మోడల్ ను కొనుగోలు చేయడంపై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ తో పాటు 25 వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.

బంగారం ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 5000 తగ్గింపు..?

దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. జ్యూవెలరీ సంస్థలు బంగారంపై భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. దీపావళి పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. అందువల్లే ఎక్కువ మొత్తంలో కాకపోయినా గ్రాము లేదా రెండు గ్రాముల బంగారాన్నైనా చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు.

పీసీ జువెలర్స్, తనిష్క్ లాంటి జ్యూవెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. గోల్డ్, డైమండ్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు ఆఫర్ల యొక్క ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు. వినియోగదారులకు పీసీ జువెలర్స్ సంస్థ 30,000 రూపాయల బంగారం కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. వినియోగదారులు గరిష్టంగా 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

అయితే పీసీ జువెలర్స్ సంస్థ కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్లను అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ల ప్రయోజనాలను పొందవచ్చు. పీసీ జువెలర్స్ వెబ్ సైట్ ద్వారా లేదా సమీపంలోని స్టోర్ కు వెళ్లి ఆఫర్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. తనిస్క్ సంస్థ బంగారం, వజ్రాల మేకింగ్ చార్జీలపై డిస్కౌంట్ అందిస్తోంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వజ్రాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపును ఇస్తోంది. 10 శాతం చెల్లించి అడ్వాన్స్ గా బంగారం బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం కొనుగోలుకు సమానంగా వెండిని ఇస్తూ ఉండటం గమనార్హం.

మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బంగారం.. ఎలా కొనుగోలు చేయాలంటే..?

మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. పండుగల సమయంలో చాలామంది మహిళలు బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే పసిడి రేటు ఆకాశాన్ని అంటుతోంది. తులం బంగారం 50,000 రూపాయల కంటే ఎక్కువ ధర పలుకుతుండటంతో సామాన్యులకు బంగారం అందని ద్రాక్షలా మారింది. అయితే కేంద్రం ఇదే సమయంలో మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.


మార్కెట్ ధర కన్నా 3000 రూపాయల కంటే తక్కువ చెల్లించి బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. గోల్డ్ బాండ్ స్కీమ్‌ ద్వారా మహిళలు బంగారం కొనుగోలు చేయవచ్చు. మోదీ సర్కార్ సోమవారం రోజు నుంచి ఈ సరికొత్త ఆఫర్ ను మహిళలకు అందుబాటులోకి తెస్తోంది. ఆర్బీఐ కేంద్రం తరపున విక్రయించే ఈ గోల్డ్ బాండ్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. సోమవారం నుంచి అక్టోబర్ 16 వరకు గ్రాముకు 5,051 రూపాయలు చెల్లించి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

10 గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే 50,510 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే మాత్రం గ్రాముకు 50 రూపాయల చొప్పున 10 గ్రాములకు 500 రూపాయల డిస్కాంట్ లభిస్తుంది. ప్రస్తుతం బంగారం మార్కెట్ ధర 53,000 రూపాయలు ఉండగా గోల్డ్ బాండ్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే 50,010 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.

బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీలు, పరిమిత సంఖ్యలో పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఏడాదికి 2.5 శాతం చొప్పున గోల్డ్ బాండ్లపై వడ్డీ లభిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు. ఎవరైనా అవసరం అనుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత బాండ్లను విక్రయించి డబ్బు పొందవచ్చు. ఇంట్లో బంగారంపై ఎలాంటి వడ్డీ రాకపోయుఇనా గోల్డ్ బాండ్లలోని బంగారం ద్వారా వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.