దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. జ్యూవెలరీ సంస్థలు బంగారంపై భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. దీపావళి పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. అందువల్లే ఎక్కువ మొత్తంలో కాకపోయినా గ్రాము లేదా రెండు గ్రాముల బంగారాన్నైనా చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు.
పీసీ జువెలర్స్, తనిష్క్ లాంటి జ్యూవెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. గోల్డ్, డైమండ్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు ఆఫర్ల యొక్క ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు. వినియోగదారులకు పీసీ జువెలర్స్ సంస్థ 30,000 రూపాయల బంగారం కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. వినియోగదారులు గరిష్టంగా 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
అయితే పీసీ జువెలర్స్ సంస్థ కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్లను అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ల ప్రయోజనాలను పొందవచ్చు. పీసీ జువెలర్స్ వెబ్ సైట్ ద్వారా లేదా సమీపంలోని స్టోర్ కు వెళ్లి ఆఫర్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. తనిస్క్ సంస్థ బంగారం, వజ్రాల మేకింగ్ చార్జీలపై డిస్కౌంట్ అందిస్తోంది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వజ్రాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపును ఇస్తోంది. 10 శాతం చెల్లించి అడ్వాన్స్ గా బంగారం బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం కొనుగోలుకు సమానంగా వెండిని ఇస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…