Tag Archives: donation

Hero Suman: ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూ విరాళం పై స్పందించిన సుమన్.. వివాదంలో ఉంటే విరాళం ఎలా ఇస్తా అంటూ..!

Hero Suman: టాలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్ ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ప్రకటించినట్లు పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలు పెద్ద ఎత్తున రావడంతో ఎంతోమంది సుమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Hero Suman: భూ విరాళం గురించి స్పందించిన సుమన్.. మా భూమి వివాదంలో ఉంది!

సుమన్ రియల్ హీరో అంటూ అతనిని ఆకాశానికి ఎత్తారు.ఇలా తన గురించి వస్తున్న ఈ వార్తలపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.తను ఇండియన్ ఆర్మీకి భూమిని విరాళంగా ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని… ఆ వార్తలు పూర్తిగా ఆ వాస్తవమేనని సుమన్ కొట్టిపారేశారు.

Hero Suman: భూ విరాళం గురించి స్పందించిన సుమన్.. మా భూమి వివాదంలో ఉంది!

ఇండియన్ ఆర్మీకి నేను విరాళంగా ఇస్తానన్న భూమి వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. వివాదంలో ఉన్న భూమిని ఎలా ఇవ్వగలము.ఇలా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆ వివాదం పరిష్కారం అయితే తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని తెలిపారు.

28 సంవత్సరాల క్రితమే ప్రకటించిన సుమన్….

సుమన్ ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇస్తానని గత 28 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. అయితే ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉంది. అది పూర్తయిన వెంటనే ఆ భూమికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా నేనే అధికారికంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా సుమన్ వెల్లడించారు.

ఏపీ వరద సహాయానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్!

గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అధిక వర్షాలు పడటంతో రాయలసీమలోని పలు జిల్లాలలో, నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరుతూ వరద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఏపీ వరద బాధితుల కోసం పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు.

ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, గీత ఆర్ట్స్ అల్లు అర్జున్ వంటి వారు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. త్వరలోనే కోటి రూపాయల చెక్కును సీఎం కార్యాలయానికి పంపించనునట్లు తెలుస్తోంది.

ఈ విధంగా ప్రభాస్ ఏపీ వరద సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడంతో పెద్దఎత్తున ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా కరోనా సమయంలో కూడా ప్రభాస్ 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా రాధే శ్యామ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్ జరుగుతుంది. అలాగే ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు.అలాగే మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వరద బాధితుల కోసం రూ.25లక్షల విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్.. అదే బాటలో మహేశ్ బాబు కూడా..

గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా.. చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.

దీంతో అక్కడ జనజీవనం అంతా స్తంభించింది. చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం భారీగా ఉంది. దీంతో తిరుమల దేవస్థానం అధికారులు దయచేసి దర్శనానికి వచ్చే వాళ్లు వాయిదా వేసుకోవాలని.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న టికెట్ల సహాయంతో దర్శణం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. ఇక అక్కడ కొన్ని గ్రామాల్లో కరెంట్ లేక.. తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అక్కడి రహదారులు అయితే కాలువలను తలపిస్తున్నాయి. వీటంన్నింటిన చూసి జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాలను చూసి బాధపడ్డారు. ఈ పరిస్థితి వేరొకరికి రాకూడదని.. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తన వంతుగా అతడు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. తన వంతుకుగా రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నాను’’ అని రాశారు. అతడితో పాటు ప్రిన్స్ మహేశ్ బాటు కూడా రూ.25 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరు వారి సహాయార్థం ఆ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.