గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా.. చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.
దీంతో అక్కడ జనజీవనం అంతా స్తంభించింది. చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం భారీగా ఉంది. దీంతో తిరుమల దేవస్థానం అధికారులు దయచేసి దర్శనానికి వచ్చే వాళ్లు వాయిదా వేసుకోవాలని.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న టికెట్ల సహాయంతో దర్శణం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. ఇక అక్కడ కొన్ని గ్రామాల్లో కరెంట్ లేక.. తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడి రహదారులు అయితే కాలువలను తలపిస్తున్నాయి. వీటంన్నింటిన చూసి జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాలను చూసి బాధపడ్డారు. ఈ పరిస్థితి వేరొకరికి రాకూడదని.. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తన వంతుగా అతడు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. తన వంతుకుగా రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నాను’’ అని రాశారు. అతడితో పాటు ప్రిన్స్ మహేశ్ బాటు కూడా రూ.25 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరు వారి సహాయార్థం ఆ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…